Botsa vs Telangana Ministers: తెలంగాణ విద్యా వ్యవస్థపై బొత్స విమర్శలు.. ఘాటుగా స్పందించిన తెలంగాణ మంత్రులు

Updated on: Jul 13, 2023 | 6:55 PM

Botsa Satyanarayana: తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన విమర్శలు రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో కలకలంరేపాయి. తెలంగాణ విద్యా వ్యవస్థలో చూచిరాతలు, స్కామ్‌లు అంటూ బొత్స ఎద్దేవా చేశారు. తెలంగాణతో ఏపీ విద్యా వ్యవస్థను పోల్చొద్దన్నారు.

తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన విమర్శలు రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో కలకలంరేపాయి. తెలంగాణ విద్యా వ్యవస్థలో చూచిరాతలు, స్కామ్‌లు అంటూ బొత్స ఎద్దేవా చేశారు. తెలంగాణతో ఏపీ విద్యా వ్యవస్థను పోల్చొద్దన్నారు. ఉపాధ్యాయుల్ని కూడా బదిలీ చేయలేని స్థితిలో తెలంగాణ ఉందన్నారు. తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు బొత్స కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ విద్యా వ్యవస్థతో ఏపీని పోల్చుడం విడ్డూరమన్నారు. అసలు రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితిలో ఏపీ ఉందంటూ విమర్శలు గుప్పించారు. ముందు ఏపీ ప్రజల బాగోగులు చూసుకోవాలని సూచించారు.