AP Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీలో సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఫైబర్ గ్రిడ్ కుంభకోణం, దేవాలయాల అభివృద్ధి, వ్యవసాయ రంగంపై, సంక్షేమం తదితర అంశాలపై చర్చిస్తున్నారు. జగనన్న గోరుముద్ద, పిల్లలకు పౌష్టికాహారం, సచివాలయ వ్యవస్థ తదితర అంశాలపై కూడా చర్చిస్తున్నారు. శాసనమండలిలో స్కిల్ డెవెలప్‌మెంట్ స్కామ్, విద్యారంగం తదితర అంశాలపై చర్చిస్తున్నారు. నాలుగో రోజు సమావేశాల్లో వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరల ప్రకటిస్తూ పోస్టర్లు ఆవిష్కరించారు. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరల ప్రకటన పోస్టర్‌ను మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆవిష్కరించారు. రైతులకు ఇకపై పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందని.. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారంటూ పేర్కొన్నారు. సీజన్ ప్రారంభానికి ముందే మద్దతు ధరలు ప్రకటించారని.. గిట్టుబాటు ధర కల్పించాలన్నదే సీఎం ఆలోచన అంటూ పేర్కొన్నారు. దళారుల ప్రమేయం లేకుండా రైతు భరోసా కేంద్రాల్లోనే CM APP ద్వారా పంటలను కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..