ఏపీలో 11 మంది ఐఏఎస్ ల బదిలీ

Updated on: Sep 09, 2025 | 1:26 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమైన బదిలీల్లో టీటీడీ ఈవో శ్యామల్ రావు బదిలీ అవ్వగా, అనిల్ కుమార్ సింహాల్‌ను కొత్త ఈవోగా నియామకం అయ్యారు. ఇతర ముఖ్యమైన శాఖలకు కూడా అధికారులను బదిలీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 11 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ ఉత్తర్వులను విడుదల చేశారు. టీటీడీ ఈవోగా ఉన్న శ్యామల్ రావును బదిలీ చేసి, ఆయన స్థానంలో అనిల్ కుమార్ సింహాల్‌ను నియమించారు. అనిల్ కుమార్ సింహాల్ 2014-19 మధ్య టీడీపీ హయాంలో కూడా టీటీడీ ఈవోగా పనిచేశారు. ఇతర బదిలీలలో ఎక్సైజ్ అండ్ మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా ముకేష్ కుమార్ మీనా, అటవీ పర్యావరణ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా కాంతిలాల్ దండే, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా సౌరవ్ గౌర్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా ప్రవీణ్ కుమార్, మరికొందరు అధికారులు ఉన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Onion Rates: ఉల్లి ధరపై.. ఆగని రైతుల లొల్లి

KTR: కవిత విషయంలో క్లారిటీ ఇచ్చిన కేటీఆర్

PM Modi: తొలి ఓటు వేసిన ప్రధాని మోదీ