CM Chandrababu Naidu: కొత్త టెక్నాలజీ తీసుకొచ్చే బాధ్యత మాది
అమరావతిలో జరిగిన క్వాంటం టాక్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు టెక్ విద్యార్థులతో మాట్లాడారు. 50,000 మంది క్వాంటం ట్రైనింగ్‌కు నమోదు చేసుకోగా, లక్ష మంది నిపుణులను తయారు చేయడమే లక్ష్యమన్నారు. కొత్త టెక్నాలజీ తీసుకురావడం ప్రభుత్వ బాధ్యత అని, కెరియర్‌ను నిర్మించుకోవడం విద్యార్థుల బాధ్యత అని సూచించారు.
అమరావతిలో జరిగిన క్వాంటం టాక్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెక్ విద్యార్థులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో క్వాంటం టెక్నాలజీ అభివృద్ధి, యువతకు అవకాశాలపై ఆయన ప్రసంగించారు. క్వాంటం ట్రైనింగ్ కోసం ఇప్పటికే 50,000 మంది రిజిస్టర్ చేసుకున్నారని, లక్ష మంది క్వాంటం నిపుణులను తయారు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఏపీలో క్వాంటం టెక్నాలజీ భవిష్యత్తుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా అందించారు. కొత్త టెక్నాలజీలను రాష్ట్రానికి తీసుకురావడం ప్రభుత్వ బాధ్యత అని, అయితే ఆ టెక్నాలజీలను అందిపుచ్చుకొని తమ కెరియర్‌ను నిర్మించుకునే బాధ్యత విద్యార్థులదేనని ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంత అంటే ??
Weather Report: చలి పంజా.. వణుకుతున్న తెలంగాణ
Peddi: పెద్దితో పోటీ.. అంత ఈజీ కాదు
TOP 9 ET News: బాహుబలి-2 రికార్డ్‌ను బద్దలు కొట్టిన ధురంధర్
కొత్త ఏడాదిలోనూ బంగారం ధర.. పైపైకే అంచనావేసిన ఆర్థిక సంస్థలు
