Amit Shah: చరిత్రను వక్రీకరించారు.. వాళ్లను ఎప్పటికీ క్షమించరు.. అమిత్ షా
Amit Shah

Amit Shah: చరిత్రను వక్రీకరించారు.. వాళ్లను ఎప్పటికీ క్షమించరు.. అమిత్ షా

Updated on: Sep 17, 2023 | 11:33 AM

Telangana Liberation Day Live: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్‌ వేదికగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తున్నారు. పరేడ్ గ్రౌండ్ కు చేరుకున్న అమిత్ షా వార్‌ మెమోరియల్‌ దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించారు. గౌరవ వందనం అనంతరం అమిత్ షా ప్రసంగించనున్నారు.

Telangana Liberation Day Live: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్‌ వేదికగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తున్నారు. శనివారం ఉదయం సీఆర్పీఎఫ్ సెక్టార్ నుంచి పరేడ్ గ్రౌండ్ కు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వార్‌ మెమోరియల్‌ దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించారు. గౌరవ వందనం అనంతరం అమిత్ షా ప్రసంగించనున్నారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ ప్రాంతంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. హోటల్స్, లాడ్జీలలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరికొన్ని రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏం మాట్లాడుతారోనన్న ఆసక్తి నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Sep 17, 2023 09:12 AM