Amaravati: రాజధాని అమరావతిలో.. అంగరంగ వైభవంగా తొలిసారి రిపబ్లిక్ వేడుకలు

Updated on: Jan 25, 2026 | 9:35 AM

11 ఏళ్లుగా ఎదురుచూస్తున్న అమరావతిలో తొలిసారిగా రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. రాయపూడిలో 22 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేసి, 13 వేల మందికి సీటింగ్, పార్కింగ్ వసతులు కల్పించారు. భూములిచ్చిన రైతులకు ప్రత్యేక గ్యాలరీతో, ఇది రాజధాని అమరావతికి చారిత్రక ఘట్టం. భద్రత, ట్రాఫిక్ నియంత్రణలతో అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా పూర్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించి 11 ఏళ్లు గడిచినా, ఇంతవరకు రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించే అవకాశం రాలేదు. 2014 నుంచి ప్రతి ఏడాది ఈ వేడుకలు అమరావతిలో జరగాలన్న ఆలోచన ఉన్నప్పటికీ, పరిస్థితులు అనుకూలించలేదు. ఇప్పుడు తొలిసారిగా ఆ లోటు తీరనుంది. ఈసారి రాష్ట్రస్థాయి రిపబ్లిక్ డే వేడుకలను అమరావతి వేదికగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న తొలి భారీ అధికారిక వేడుకగా దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. సీడ్ యాక్సిస్ రోడ్డుకు సమీపంలో రాయపూడి ప్రాంతంలో, మంత్రుల బంగ్లాల ఎదురుగా పరేడ్ గ్రౌండ్‌ను ఏర్పాటు చేశారు. మొత్తం 22 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్‌ను అభివృద్ధి చేశారు. పరేడ్ ట్రాక్, ప్రధాన వేదిక, గ్యాలరీల నిర్మాణం కొనసాగుతోంది. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ దృష్ట్యా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేపడుతున్నారు. వేడుకలకు హాజరయ్యే వీవీఐపీ, వీఐపీ వాహనాల పార్కింగ్‌కు 15 ఎకరాలు, ప్రజల పార్కింగ్ కోసం మరో 25 ఎకరాల విస్తీర్ణాన్ని కేటాయించారు. సుమారు 13 వేల మందికి సీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రవేశ ద్వారాలు, నిష్క్రమణ మార్గాలు స్పష్టంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతుల కోసం ప్రత్యేకంగా వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేశారు. రైతులు వేడుకల్లో పాల్గొనాలని కోరుతూ అధికారులు ఆహ్వాన పత్రికలు పంపించారు. గ్రామ స్థాయి నుంచి రైతులు, ప్రజలు హాజరయ్యేలా సమన్వయం చేస్తున్నారు. వేడుకలకు వచ్చే వీవీఐపీలు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ట్రాఫిక్, భద్రత, పార్కింగ్ అంశాలపై ముందుగానే సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశారు. తొలిసారి అమరావతి వేదికగా రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: భగ్గుమంటున్న బంగారం.. ఇవాళ ధర ఎంతంటే

రథసప్తమి వేళ అరసవిల్లిలో అర్ధరాత్రి నుంచే పూజలు ప్రారంభం

TOP 9 ET: చిక్కుల్లో చిరు నెక్స్ట్‌ మూవీ ?? | బుక్ మై షోలో.. బాస్ దిమ్మతిరిగే రికార్డ్

The Raja Saab: రాజాసాబ్‌కు రూ.100 కోట్ల నష్టం ??

షాకింగ్‌ న్యూస్‌.. అరికాళ్ళపై షుగర్ దాడి