Kangana Ranaut: ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్ చిక్కుల్లో పడనుందా.?
మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఆ సీటు నుంచి పోటీ చేసేందుకు తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను అన్యాయంగా తిరస్కరించారంటూ కిన్నౌర్‌వాసి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కంగనా రనౌత్‌కు కోర్టు నోటీసులిచ్చింది. ఆగస్టు 21లోగా ఆమె తన స్పందనను తెలియజేయాలని తెలిపింది.
మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఆ సీటు నుంచి పోటీ చేసేందుకు తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను అన్యాయంగా తిరస్కరించారంటూ కిన్నౌర్‌వాసి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కంగనా రనౌత్‌కు కోర్టు నోటీసులిచ్చింది. ఆగస్టు 21లోగా ఆమె తన స్పందనను తెలియజేయాలని తెలిపింది. మండిలో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాధిత్య సింగ్‌ను బీజేపీ తరఫున పోటీ చేసిన కంగనా రనౌత్ 74,755 ఓట్లతో ఓడించారు. అదే ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను తప్పుడు కారణాలతో తిరస్కరించారని పేర్కొంటూ లాయక్ రామ్ నేగి తాజాగా కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రనౌత్ ఎన్నికను పక్కన పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
అటవీ విభాగంలో పనిచేసిన తాను.. ముందస్తుగానే ఉద్యోగవిరమణ చేసినట్లు నేగి తన వ్యాజ్యంలో తెలిపారు. నామినేషన్ పత్రాలతో పాటే డిపార్ట్‌మెంట్ నుంచి పొందిన ‘నో డ్యూ సర్టిఫికెట్’ను జత చేసినట్లు వెల్లడించారు. కానీ, విద్యుత్తు, తాగునీరు, టెలిఫోన్ విభాగాల నుంచి కూడా సర్టిఫికెట్లు తీసుకురావాలని రిటర్నింగ్ అధికారి ఆదేశించినట్లు తెలిపారు. అందుకు ఇచ్చిన ఒకరోజు గడువులోగా తాను అన్నీ తీసుకెళ్లినట్లు చెప్పారు. వాటిని తీసుకోకపోగా.. తన నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. నామపత్రాలు అంగీకరించి ఉంటే తాను అక్కడి నుంచి గెలిచేవాడినని రామ్ నేగి తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. అందుకే ఈ ఎన్నికను పక్కనపెట్టాలని విజ్ఞప్తి చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.