పేకాడుతున్న 281 మంది అరెస్ట్, 280 వాహనాలు స్వాధీనం

Updated on: Dec 22, 2025 | 7:17 PM

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలోని మ్యాంగో బే కల్చరల్ రీక్రియేషన్ క్లబ్‌పై పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 281 మందిని అరెస్ట్ చేసి, 35 లక్షల నగదు, 130 కార్లు, 40కి పైగా బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు కాట్రగడ్డ అశోక్ సహా ముగ్గురిపై కేసు నమోదైంది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలోని మ్యాంగో బే కల్చరల్ రీక్రియేషన్ క్లబ్‌లో అక్రమ పేకాట దందాపై పోలీసులు నిన్న సాయంత్రం మెరుపుదాడి చేశారు.

ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలోని మ్యాంగో బే కల్చరల్ రీక్రియేషన్ క్లబ్‌లో అక్రమ పేకాట దందాపై పోలీసులు నిన్న సాయంత్రం మెరుపుదాడి చేశారు. ఈ దాడుల్లో 281 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 35 లక్షల రూపాయల నగదుతో పాటు 130 కార్లు, 40కి పైగా బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మ్యాంగో బే క్లబ్ నిర్వాహకులైన కాట్రగడ్డ అశోక్, చేవూరి లక్ష్మణ్, అప్పారావులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరు 10,000, 20,000, 30,000 రూపాయల ఫుల్ గేమ్స్‌ను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price Today: మహిళలకు భారీ షాక్‌.. రాత్రికి రాత్రే పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు

Dubai: నదుల్లా మారిన దుబాయ్‌ రోడ్లు..

కోటి ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన నవ జంట.. అంతలోనే..

రెండు నెలల ఆపరేషన్‌ సక్సెస్‌.. బోనులో చిక్కిన మ్యాన్‌ ఈటర్‌

అమావాస్య వేళ పచ్చని పొలంలో క్షుద్ర పూజలు.. ఏం జరిగిందంటే