AP News: పైకి చూస్తే మినీవ్యాన్ నిండా టార్పన్లు.. తీరా లోపల చెక్ చేయగా..

|

Dec 20, 2024 | 7:00 PM

ఓరి మీ దుంపతెగ.! ఇలా ఉన్నారేంట్రా.. అస్సలు మీరు మారరా.? ఎన్ని చట్టాలు వచ్చినా.. అక్రమ దందా మాత్రం కొనసాగుతోంది. యదేచ్చగా తమ క్రియేటివిటీతో కేటుగాళ్లు మత్తు పదార్ధాలు, గంజాయి, డ్రగ్స్‌ను రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు. ఈ స్టోరీ కూడా అలాంటిదే..!

పుష్ప సినిమా తరహాలో కేటుగాళ్లు తెలివిమీరి పోయారు. గంజాయి, డ్రగ్స్, మత్తుపదార్ధాలను అక్రమంగా క్రియేటివిటీతో రాష్ట్ర సరిహద్దులను దాటించేస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పుతున్నామని వాళ్లు అనుకుంటుంటే.. ఖాకీలు ఏమైనా తక్కువా.. వారిని ఎక్కడిక్కడ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి తరహ ఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా గొలుగొండలో చోటు చేసుకుంది. గొలుగొండ మండలం చెక్‌పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఓ మినీ వ్యాన్ పైకప్పుపై పుష్ప సినిమా తరహాలో దాచిపెట్టిన 450 కేజీల గంజాయి లభ్యమైంది. నిందితులు తెలివిగా వ్యాన్‌ పైకప్పులో టార్పన్ల కింద గుట్టుగా గంజాయి ప్యాకెట్లు దాచిపెట్టగా.. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.

ఇది చదవండి: గుడ్‌న్యూస్.. ఏపీకి రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లు.? ఏ రూట్‌లోనంటే.!