అందెశ్రీ అందుకే చనిపోయారా ?? గాంధీ వైద్యులు సంచలన ప్రకటన
ప్రముఖ కవి అందెశ్రీ గుండెపోటుతో కన్నుమూశారు. గాంధీ ఆసుపత్రి వైద్యుల ప్రకటన ప్రకారం, ఆయన గత నెల రోజులుగా హైపర్‌టెన్షన్ మందులు వాడలేదు. ఆరోగ్య విషయంలో ఆయన నిర్లక్ష్యం వహించారని వైద్యులు తెలిపారు. ఉదయం ఇంట్లో కుప్పకూలగా, ఆసుపత్రికి తరలించేలోపే మరణించినట్లు వెల్లడించారు.
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు. సోమవారం ఉదయం ఇంట్లో కుప్పకూలి పడిపోయిన అందెశ్రీని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా… అందెశ్రీ మృతిపై గాంధీ వైద్యులు సంచలన ప్రకటన చేశారు. హార్ట్‌స్ట్రోక్ వల్లే ఆయన చనిపోయారని.. కానీ గత కొద్దిరోజులుగా ఆయన మందులు వాడటం లేదని గాంధీ ఆస్పత్రి హెచ్‌ఓడీ జనరల్ సునీల్ కుమార్ తెలిపారు. సోమవారం ఉదయం 7:30 గంటలకు అందెశ్రీని కుటుంబసభ్యులు గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారని సునీల్ కుమార్ తెలిపారు. బ్రాట్ డెడ్‌గా వైద్యులు డిక్లేర్ చేసినట్లు చెప్పారు. హార్ట్‌స్ట్రోక్ వల్లే అందెశ్రీ చనిపోయినట్లు వెల్లడించారు. అందెశ్రీకి గత ఐదేళ్లుగా హైపర్ టెన్షన్ ఉందని… అయితే ఒక నెలరోజుల నుంచి మెడిసిన్ వాడటం లేదని తెలిపారు. ఆయనకు ఆయాసం ఉందని, చెస్ట్ డిస్‌కంఫర్టబుల్ ఉందన్నారు. ఆరోగ్య విషయంలో అందెశ్రీ నిర్లక్ష్యం చేసినట్లు చెప్పారు. గత రాత్రి భోజనం తర్వాత మామూలుగానే పడుకున్నారని తెలిపారు. ఉదయం లేచి కుటుంబ సభ్యులు చూసేసరికి బాత్ రూమ్ వద్ద కింద పడిపోయి ఉన్నారని అన్నారు. రాత్రి ఏం జరిగిందో తెలియదని.. ఉదయం కుటుంబ సభ్యులు అందెశ్రీని గమనించి ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు హెచ్‌ఓడీ జనరల్ సునీల్ కుమార్ పేర్కొన్నారు. అందెశ్రీ చనిపోయారని గాంధీ ఆస్పత్రిలో ఆర్‌ఎంవో డిక్లేర్ చేశారని డాక్టర్ సింధూర తెలిపారు. ఆయన చనిపోయి ఐదు గంటలు అయి ఉండొచ్చన్నారు. మూడు రోజులుగా అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఆయన వైద్యున్ని సంప్రదించలేదని, నెల రోజుల నుంచి బీపీ మాత్రలు వేసుకోలేదని డాక్టర్ సింధూర వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kadapa: అమీన్‌పీర్ దర్గాను సందర్శించిన కమెడియన్ అలీ, హీరో సుమన్
Jubilee Hills Bypoll Updates: పోలింగ్ బూత్ లకు రాని జూబ్లీహిల్స్ ఓటర్స్.. కారణం ఏంటి..?
Jubilee Hills Bypoll: డ్రోన్ కెమెరాలతో జూబ్లీహిల్స్ ఓటింగ్ పర్యవేక్షణ
