PM Modi in Bhutan: ప్రధాని మోదీకి భూటాన్‌లో స్వీట్ సర్‌ప్రైజ్

|

Mar 22, 2024 | 6:55 PM

ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్‌ పర్యటనలో ఉన్నారు. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘డ్రూక్‌ గ్యాల్పో’ను ఆయన అందుకున్నారు. భూటాన్‌కు చేరుకొన్నాక మోదీ గౌరవార్థం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక వేడుకల్లో భారతీయ సంస్కృతి, పాటలు ప్రముఖంగా కనిపించాయి. గుజరాతీ, హిందీ పాటలకు కళాకారులు నృత్యాలు చేశారు.

2 రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ఉదయం భూటాన్ వెళ్లారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ఆయనకు ఆ దేశంలో అపూర్వ స్వాగతం లభించింది. రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో వివిధ కార్యక్రమాలకు మోదీ హాజరువుతున్నారు. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘డ్యూక్‌ గ్యాల్పో’ను మోదీ అందుకున్నారు. ఆ అవార్డును 140 కోట్ల మంది భారతీయులకు అంకితం ఇస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.

కాగా ప్రధాని గౌరవార్థం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో గుజరాతీ, హిందీ పాటలకు కళాకారులు నృత్యాలు చేశారు. వారి ప్రదర్శనను ప్రధాని ఆసక్తిగా తిలికించారు.  ఆ దృశ్యాలు ప్రజంట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.  2014లో భారత ప్రధానిగా అధికారం చేపట్టినప్పటి నుంచి ఈ దేశంలో పర్యటించడం ఇది మూడోసారి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

 

Published on: Mar 22, 2024 06:48 PM