Republic Day Parade: అంబరాన్నంటేలా గణతంత్ర వేడుకలు.. కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్ డే పరేడ్.. లైవ్ వీడియో
రిపబ్లిక్‌డే పరేడ్ విజయ్ చౌక్ నుంచి ప్రారంభమై.. కర్తవ్య పథ్ మీదుగా ఎర్రకోటకు చేరుకుంటుంది. ఈ పరేడ్‌లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 16 శకటాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, సంస్థలకు చెందిన 15 శకటాలు పాల్గొంటాయి. కవాతు సందర్భంగా సుమారు 5 వేలమంది కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు.
ఢిల్లీ కర్తవ్యపథ్‌లో స్వర్ణిమ్ భారత్, విరాసత్ ఔర్ వికాస్ థీమ్‌తో ఈ ఏడాది రిపబ్లిక్‌డే వేడుకలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు.. రిపబ్లిక్ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రిపబ్లిక్‌డే పరేడ్..
ఉదయం పదిన్నరకు రిపబ్లిక్‌డే పరేడ్ విజయ్ చౌక్ నుంచి ప్రారంభమై.. కర్తవ్య పథ్ మీదుగా ఎర్రకోటకు చేరుకుంటుంది. ఈ పరేడ్‌లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 16 శకటాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, సంస్థలకు చెందిన 15 శకటాలు పాల్గొంటాయి. కవాతు సందర్భంగా సుమారు 5 వేలమంది కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. మహాకుంభ్ ప్రాముఖ్యతను తెలియజేసే శకటం ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.. ఇక త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం ఈ సారి ప్రత్యేకత. నింగి, నేల, సముద్రంపై జరిగే యుద్ధ దృశ్యాలతో ఈ శకటాన్ని తీర్చిదిద్దారు.
ప్రధాని మోదీ ట్వీట్..
దేశ వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగాన్ని రూపొందించిన మహానుభావులకు వందనాలంటూ మోదీ Xలో పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యం, ఔన్నత్యం, ఐక్యత పునాదులపై మన ప్రస్థానం సాగుతోందని ప్రధాని మోదీ అన్నారు. మన రాజ్యాంగ ఆదర్శాలను పరిరక్షిస్తూ, శక్తివంతమైన, సమృద్ధ భారత నిర్మాణానికి ఈ సందర్భం ఉపయోగపడాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. కాగా..

మోటారు లేకుండానే ఉబికి వస్తున్న గంగ

కారును రైల్వే ప్లాట్‌ఫామ్‌పైకి పోనిచ్చి.. ఆ పై పట్టాల మీద పడి ??

భర్త కిడ్నీ అమ్మి.. ఆ డబ్బుతో ప్రియుడితో పరార్

పక్కింటి అమ్మాయిని వీడియో తీసిన యువకుడు.. ఆ తర్వాత ??

గ్రీన్ టీ తాగేవారికి అలెర్ట్.. వామ్మో ఇన్ని సమస్యలా..!

నాలుక కోసి శివలింగానికి సమర్పించుకుంది.. చివరకు..

చైనాపై ఆంక్షలు.. ఆ పార్సిళ్లు కూడా బంద్
