Heritage Train: ఫస్ట్ హెరిటేజ్ ట్రైన్.. రాజస్థాన్‌లో పట్టాలెక్కిన మొదటి వారసత్వ రైలు.

|

Oct 08, 2023 | 1:33 PM

రాజస్థాన్‌లో మొదటి వారసత్వ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 150 ఏళ్లనాటి ఆవిరి ఇంజిన్‌ను ప్రతిబింబించేలా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ రైలు పాలీ జిల్లాలో మార్వార్ ప్రాంతం నుంచి ఖామ్లిఘాట్‌ వరకు ప్రయాణించనుంది. ప్రముఖ చారిత్రక ప్రదేశాలను కలుపుతూ ఈ రైలు పర్యటన సాగుతుంది. అందమైన లోయల గుండా సాగే ఈ ప్రయాణం భారత రైల్వే చరిత్ర, వారసత్వ సంపదను ప్రతిబింబిస్తుంది.

రాజస్థాన్‌లో మొదటి వారసత్వ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 150 ఏళ్లనాటి ఆవిరి ఇంజిన్‌ను ప్రతిబింబించేలా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ రైలు పాలీ జిల్లాలో మార్వార్ ప్రాంతం నుంచి ఖామ్లిఘాట్‌ వరకు ప్రయాణించనుంది. ప్రముఖ చారిత్రక ప్రదేశాలను కలుపుతూ ఈ రైలు పర్యటన సాగుతుంది. అందమైన లోయల గుండా సాగే ఈ ప్రయాణం భారత రైల్వే చరిత్ర, వారసత్వ సంపదను ప్రతిబింబిస్తుంది. ఈ హెరిటేజ్ రైలులో 60 మంది ప్రయాణికులు ప్రయాణించేలా ఏర్పాటు చేశారు. పర్యటక ప్రదేశాలను చూడటానికి ట్రైన్‌లో పెద్ద ద్వారాలు ఏర్పాటు చేశారు. మినీ కశ్మీర్‌ గా పిలువబడే గోరమ్‌ ఘాట్, భిల్ బేరీ వాటర్‌ఫాల్‌ వంటి ప్రదేశాలను కలుపుతూ రైలు ప్రయాణం సాగుతుంది. రైలు రూపకల్పన 150 ఏళ్ల నాటి ఆవిరి ఇంజిన్‌ను ప్రతిబింబిస్తుంది. మార్వార్ జంక్షన్ నుంచి కామ్లిఘాట్ వరకు వారానికి నాలుగు సార్లు ఈ రైలు ప్రయాణం ఉంటుంది. హెరిటేజ్ రైలు ప్రయాణానికి ఒక్కొ టికెట్‌కు 2 వేల రూపాయలుగా నిర్ణయించారు. UNESCO భారత్‌లో నాలుగు రైల్వే లైన్లకు ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించింది. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటైన్ రైల్వే, కల్కా సిమ్లా రైల్వే, ఛత్రపతి శివాజీ టెర్మినస్, ముంబై లు అందులో ఉన్నాయి. మథెరన్ లైట్ రైల్వే, కాంగ్రా వ్యాలీ రైల్వే తాత్కాలిక జాబితాలో ఉన్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..