PM Modi: నైజీరియా చేరుకున్న మోదీ.. అబుజాలో ప్రధానికి గ్రాండ్ వెల్‌కమ్
మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ నైజీరియా చేరుకున్నారు. మోదీకి అబుజాలో గ్రాండ్ వెల్‌కమ్ తెలిపారు. ఈ సందర్భంగా నైజారియాలో స్థిరపడ్డ మరాఠీలు ప్రధానిని కలిశారు. మరాఠీ భాషకు క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇచ్చినందుకు ప్రధానికి కృతజ్ఞతలు వారు తెలిపారు..
భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా నైజీరియా చేరుకున్నారు. అబుజాలో నరేంద్ర మోదీకి గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. మరాఠీ భాషకు క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇచ్చినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు నైజారియాలో స్థిరపడ్డ మరాఠీలు. ప్రధాని రాక సందర్భంగా మరాఠీ సంప్రదాయ లావని నృత్యం ప్రదర్శించారు.
నైజీరియా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో మోదీ సమావేశమవుతారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. ఇందులో భాగంగా సోమవారం జీ-20 సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్లనున్నారు మోదీ . జీ-20 దేశాధినేతలతో భేటీ కానున్నారు. ఎల్లుండి గయానాలో పర్యటించనున్నారు.
అలాగే ప్రధాని ఈ నెల19వ తేదీన గయానాకు వెళతారు. గయానా అధ్యక్షుడైన మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ అహ్వానం మేరకు మోదీ ఆ దేశంలో నవంబర్ 21వ తేదీ వరకు ఉంటారు. గయానాలో జరగనున్న ఇండియా-కరికోమ్ సదస్సులో కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి ప్రదానం చేయనుంది. అయితే, 17 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇక, 50 ఏళ్ల భారత ప్రధాని గయానాలో పర్యటించటం విశేషం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..