PM Modi in Dwarka: సముద్ర గర్భాన ప్రధాని మోదీ సాహసం.. ద్వారకాలో ప్రత్యేక ప్రార్థనల వీడియో చూశారా..!
ప్రధాని నరేంద్ర మోదీ సముద్ర గర్భంలో మరోసారి సాహసం చేశారు. అరేబియా సముద్ర గర్భంలోని హిందువుల పురాతన ఆధ్యాత్మిక నగరం ద్వారకాలో మోదీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని పాలించినట్లు కోట్లాది మంది హిందువుల బలమైన విశ్వాసం. ద్వారకాలో ప్రత్యేక ప్రార్థనల కోసం ప్రధాని మోదీ సముద్ర గర్భంలోకి వెళ్లడం సోషల్ మీడియా వేదికల్లో ఆసక్తికరంగా మారింది.
ప్రధాని నరేంద్ర మోదీ సముద్ర గర్భంలో మరోసారి సాహసం చేశారు. అరేబియా సముద్ర గర్భంలోని హిందువుల పురాతన ఆధ్యాత్మిక నగరం ద్వారకాలో మోదీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని పాలించినట్లు కోట్లాది మంది హిందువుల బలమైన విశ్వాసం. ద్వారకాలో ప్రత్యేక ప్రార్థనల కోసం ప్రధాని మోదీ సముద్ర గర్భంలోకి వెళ్లడం సోషల్ మీడియా వేదికల్లో ఆసక్తికరంగా మారింది. బెట్ ద్వారకా ద్వీపం దగ్గర ప్రధాని మోదీ సముద్రజలాల్లోకి వెళ్లిన వీడియోను ప్రధాని మోదీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. సముద్ర నీటిలో పురాతన నగర శిథిలాల దగ్గర ప్రధాని మోదీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ప్రధాని మోదీ షేర్ చేసిన ఈ వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సముద్ర గర్భంలోని ద్వారాకాను దర్శించుకోవడం దివ్వానుభూతిని కలిగించిందని ప్రధాని మోదీ చెప్పారు.