Good News For Farmers : రైతులకు తీపికబురు.. నాలుగు రోజుల్లో
అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం కింద 21వ విడత నిధులను నవంబర్ 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ప్రధాని మోదీ నిధులు నేరుగా బదిలీ చేస్తారు. పీఎం-కిసాన్ పోర్టల్‌లో భూమి వివరాలు, ఆధార్ అనుసంధానం తప్పనిసరి.
అన్నదాతలకు కేంద్రప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 21వ విడత నిధులను నవంబరు 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ ప్రకటనలో తెలిపారు. అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి 24న పీఎం-కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏటా మూడు విడతల్లో రూ.6,000 ఆర్థిక సాయం అందుతోంది. ఇప్పటివరకు 20 విడతల్లో దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు రూ.3.70 లక్షల కోట్లకు పైగా నిధులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే రైతుల భూమి వివరాలు తప్పనిసరిగా పీఎం-కిసాన్ పోర్టల్‌లో నమోదై ఉండాలి. అలాగే, బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం కూడా తప్పనిసరి. ఈ నిబంధనలు పాటించిన రైతులకే 21వ విడత నిధులు వారి ఖాతాల్లో జమ అవుతాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పోలీసులకే సవాల్ విసిరి.. చివరికి ఇలా
అమెజాన్ బెజోస్ రాకెట్‌తో అంగారకుడి పైకి వ్యోమనౌక
తల్లి చేసిన అద్బుతం కోమాలో నుంచి కూతురు బయటకు
