Parliament Monsoon Session LIVE: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం

Updated on: Jul 21, 2025 | 11:07 AM

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కాగా.. 8 బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సమావేశాలకు ముందు డిమాండ్లు, వాయిదా తీర్మానాలతో విపక్షాలు సిద్ధం అయ్యాయి.. పహల్గామ్‌, ఆపరేషన్‌ సింధూర్‌, బిహార్‌ ఓటర్‌ జాబితాపై వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నాయి. పహల్గామ్‌ దాడిపై చర్చించాల్సిందేనని కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్కం ఠాగూర్‌ డిమాండ్‌ చేశారు.

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కాగా.. 8 బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సమావేశాలకు ముందు డిమాండ్లు, వాయిదా తీర్మానాలతో విపక్షాలు సిద్ధం అయ్యాయి.. పహల్గామ్‌, ఆపరేషన్‌ సింధూర్‌, బిహార్‌ ఓటర్‌ జాబితాపై వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నాయి. పహల్గామ్‌ దాడిపై చర్చించాల్సిందేనని కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్కం ఠాగూర్‌ డిమాండ్‌ చేశారు. ఇంటెలిజెన్స్‌ వైఫల్యం, టెర్రరిస్టులను అరెస్ట్‌ చేయకపోవడంపై.. పార్లమెంటులో చర్చించాలని శివసేన UBT ఎంపీ ప్రియాంక చతుర్వేది డిమాండ్‌ చేశారు. పహల్గామ్‌ దాడిపై ప్రధాని జవాబు చెప్పాలని డీఎంకే ఎంపీ TR బాలు పేర్కొన్నారు. కాల్పుల విరమణపై ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని విపక్షం డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై మోదీ ఇప్పటికే సమాధానం చెప్పారంటున్న బీజేపీ ఎంపీ దామోదర్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.

పార్లమెంటు సమావేశాల అజెండా ఖరారుకు బీఏసీ భేటీ జరగనుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు లోక్‌సభ బీఏసీ జరుగుతుంది. రెండున్నరకు రాజ్యసభ బీఏసీ సమావేశం కానుంది. ఉభయసభల్లో చర్చకు రావల్సిన అంశాలను బీఏసీ మీటింగ్‌లు ఖరారుచేయనున్నాయి.

Published on: Jul 21, 2025 11:07 AM