Paralysis: పక్షవాతం లక్షణాలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Updated on: Oct 08, 2025 | 6:14 PM

పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్) మెదడులో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం లేదా చిట్లడం వల్ల వస్తుంది. దీని లక్షణాలు బీ-ఫాస్ట్ (BEFAST) ద్వారా గుర్తించవచ్చు. ఇది సడన్ గా సంభవించినప్పటికీ, రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్ వంటి ప్రమాద కారకాలను నియంత్రించడం ద్వారా నివారించవచ్చు. సకాలంలో వైద్య చికిత్స (గోల్డెన్ అవర్) మరియు అధునాతన థెరపీలు రికవరీకి కీలకం.

పక్షవాతం, లేదా బ్రెయిన్ స్ట్రోక్, అనేది మెదడుకు సంబంధించిన రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం (ఇష్కిమిక్ స్ట్రోక్) వల్ల లేదా రక్తనాళాలు చిట్లడం (హెమరేజిక్ స్ట్రోక్) వల్ల సంభవిస్తుంది. ఇది సాధారణంగా 60 సంవత్సరాలు పైబడిన వారిలో కనిపించినప్పటికీ, ప్రస్తుత రోజుల్లో 45 సంవత్సరాల లోపు వారిలో కూడా దీని కేసులు పెరుగుతున్నాయి. పక్షవాతం యొక్క లక్షణాలను సులభంగా గుర్తించడానికి వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ‘బీ-ఫాస్ట్’ (BEFAST) అనే సూత్రాన్ని సూచిస్తుంది. : B (బ్యాలెన్సింగ్ – సమతుల్యత కోల్పోవడం), E (ఐ ప్రాబ్లమ్స్ – కంటి చూపు సమస్యలు), F (ఫేషియల్ డీవియేషన్ – ముఖం వంకరపోవడం), A (ఆర్మ్ వీక్‌నెస్ – చేతిలో పట్టు తప్పడం), S (స్పీచ్ అబ్నార్మాలిటీ – మాట ముద్దముద్దగా రావడం), T (టైం – వెంటనే ఆసుపత్రికి వెళ్లడం).

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అనుకోని వరంలా మారిన ఉత్తర బెంగాల్ వరదలు

వన్డే కెప్టెన్‌గా గిల్‌ !! రోహిత్‌కు మరో షాక్‌ తప్పదా ??

నటుడు మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా

పోకిరీల ఓవరాక్షన్‌.. చార్మినార్‌ వద్ద విదేశీ మహిళపై అసభ్యకర కామెంట్లు

Dhanush: సొంతూరులో ధనుష్ సందడి.. గ్రామస్తులకు నాన్‌ వెజ్‌ విందు