Palm Jaggery: తాటి బెల్లం ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు!

Updated on: Sep 14, 2025 | 1:58 PM

నార్మల్ బెల్లం కంటే తాటి బెల్లం మంచిది. దీనికి కారణం అందులోని పోషకాలు. తాటి బెల్లంలో ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది. ఇది కాస్త కారామెల్ రుచిని ఇస్తుంది. వంటలకి ఎక్స్‌ట్రా స్మోకీ ఫ్లేవర్‌ని యాడ్ చేసి రుచిని పెంచుతుంది. తాటిబెల్లాన్ని తక్కువ ప్రాసెస్‌తో నేచురల్‌గా తయారు చేస్తారు.

కాబట్టి, కెమికల్స్ ఉండవు. నార్మల్ బెల్లం మంచిదే అయినప్పటికీ, తాటిబెల్లం ఇంకాస్త మంచిది ఎంతో హెల్దీ. దీనిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. పంచదార వాడితే ఎన్ని సమస్యలొస్తాయో తెలిశాక వాటి బదులు బెల్లం వాడడం మొదలుపెట్టారు. కానీ, బెల్లం కూడా చెరకుతోనే తయారుచేస్తారు. ఇది కూడా ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి ఇబ్బందే అని కొంతమంది వాదిస్తున్నారు. దీంతో మరో బెస్ట్ ఆల్టర్నేటివ్‌ కోసం ఆలోచించేవారికి వరంగా తాటిబెల్లం దొరికింది. ఇన్నిరోజులు కాస్తా దీని గొప్పదనం కొంతమందికి తెలిసినప్పటికీ అంతలా పాపులర్ అవ్వలేదు. కానీ, ఇప్పుడు చాలా మంది ఈ తాటి బెల్లం బెనిఫిట్స్ గురించి చెబుతున్నారు. బెల్లం కూడా ఆరోగ్యమైనప్పటికీ తాటిబెల్లంలో ఖనిజాలు మరి కాస్తా ఎక్కువగా ఉంటాయి. అయితే, ఫ్లేవర్ మాత్రం కాస్త స్మోకీగా ఉంటుంది. నార్మల్ షుగర్, బెల్లం బదులు ఏ వంటల్లో అయినా వాడొచ్చు. అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే దీనిని తినొచ్చు. దీని వల్ల శక్తి అందుతుంది. నిపుణుల సూచనల మేరకు మేం మీకు ఈ సమాచారం అందించాం. ఆరోగ్యసమస్యలున్నవారు మా సూచనలు పాటించే ముందు మీ వ్యక్తిగత వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తగ్గుతున్న మనిషి ఆయుర్దాయం.. కారణం ఇదే

Cancer Injection: ఒక్క ఇంజెక్షన్‌.. క్యాన్సర్‌ మాయం.. ఫలిస్తున్న పరిశోధనలు..

ఇన్ని తెలివితేటలు ఏంటి భయ్యా.. మీ బైక్‌ను ఎవరూ కొట్టేయలేరు

అలారం శబ్దంతో గుండెపోటు..!

చలికాలంలో వెచ్చదనం, మండే ఎండల్లో కూల్.. ఈ ఇంటి డిజైన్‌ చూసారా?