Garikapati: గరికపాటి చెప్పిందేంటి ?? జనానికి అర్ధమైంది ఏంటి ??

Updated on: Mar 22, 2026 | 9:08 PM

ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు మధ్యాహ్న భోజన పథకం, ఉచిత యూనిఫామ్‌లు, పుస్తకాలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆయన మాటలపై ప్రజల నుంచి, విద్యావేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మధ్యాహ్న భోజనం పిల్లల హక్కు అని, ఈ పథకం పేదల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు, ప్రజలు స్పష్టం చేస్తున్నారు.

పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు మధ్యాహ్న భోజన పథకంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఒక కార్యక్రమంలో ఆయన ప్రభుత్వ మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫామ్‌లు, పాఠ్యపుస్తకాల పంపిణీని విమర్శిస్తూ “గుడ్డా గాడిద గుడ్డా” వంటి పదాలు వాడటంతో ప్రజాగ్రహం వెల్లువెత్తింది. గరికిపాటి వ్యాఖ్యలను ప్రజా సంఘాలు, పౌర హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలు తీవ్రంగా ఖండించారు. మధ్యాహ్న భోజనం పేద పిల్లల ఆరోగ్యం, హాజరు, విద్యాభివృద్ధికి అత్యవసరమని, ఇది దానం కాదని, పిల్లల జన్మహక్కు అని పేర్కొన్నారు. 1990లలో డ్రాపౌట్ రేటును తగ్గించి, పేద విద్యార్థులకు విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ పథకం లక్షలాది మంది జీవితాలను మార్చిందని వివరించారు. గరికిపాటి వంటి ప్రవచనకర్త ఈ పథకం ప్రాముఖ్యతను గుర్తించకపోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జ్యోతిషం పేరుతో 58 మంది మహిళలపై అత్యాచారం

కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం

మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !

ఎంత అమానవీయం !! ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని.. పక్షిని చంపిన వ్యక్తి

దారిచ్చిన వ్యక్తికి ఏనుగు థ్యాంక్స్‌ చెప్పిందిలా.. గజరాజు వైరల్ వీడియో

Loading...
Unable to load recommendations.
Follow Us