మనిషిలా ముఖం పై కళ్లున్న ఏకైక పక్షిని చూసారా వీడియో

Updated on: Aug 08, 2025 | 11:47 AM

గుడ్లగూబలు మానవాళికి ఎంతో మేలు చేస్తున్నాయి. ఒక్క గాదె గుడ్లగూబ లేదా బార్న్‌ ఔల్‌ తన జీవిత కాలంలో 11 వేల ఎలుకలను తింటుందని అంచనా. తద్వారా 13 టన్నుల ఆహార పంటలను కాపాడుతుందని ఒక పరిశోధనలో తేలింది. ఇంత మేలు చేస్తున్న గుడ్లగూబలను అపోహలతో, అపనమ్మకాలతో మనుషులు దూరం చేసుకుంటున్నారు. ఏటా ఆగస్ట్ 4వ తేదీని ఔల్‌ అవేర్‌నెస్‌ డేగా ప్రపంచం జరుపుకుంటోంది. చాలా మంది గుడ్లగూబను నేరుగా చూసి ఉండకపోవచ్చు. ఎందుకంటే అవి రాత్రిళ్లు ఎక్కువగా సంచరిస్తాయి, వాటి పెద్ద పెద్ద కళ్లు, విచిత్రమైన అరుపులతో ప్రత్యేకంగా నిలుస్తాయి.

గుడ్లగూబలో ఎవ్వరికీ పెద్దగా తెలియని ప్రత్యేక లక్షణాలు చాలానే ఉన్నాయి. ఇతర పక్షుల్లా కాకుండా గుడ్లగూబలకు కళ్లు మనుషులకు ఉన్నట్లుగా ముఖం పై ఉంటాయి. కానీ మనుషుల్లా అవి కళ్లను కదిలించలేవు. అందుకే అవి తలను 270 డిగ్రీలు తిప్పి చూడగలుగుతాయి. ఈ ప్రత్యేక లక్షణం కారణంగా కొందరు చేతబడి, క్షుద్రపూజలకు వాటిని ఉపయోగిస్తున్నారు. చాలా మంది అపశకునంగా భావిస్తూ వాటి గూళ్లను నాశనం చేస్తున్నారు. దీంతో గుడ్లగూబల ఉనికికే ప్రమాదం ఏర్పడింది. గుడ్లగూబలు రాత్రి వేళల్లో చురుగ్గా వేటాడతాయి. సాధారణంగా పక్షులు గాల్లోకి ఎగిరినప్పుడు రెక్కల శబ్ధం వినిపిస్తుంది. కానీ గుడ్లగూబలు నిశ్శబ్దంగా ఎగురుతాయి. అవి జంతువులకు దొరక్కుండా, వాటిని మభ్యపెట్టేందుకు ప్రత్యేక ఈకల రంగు తో చెట్టు బెరడు, ఆకుల్లో కలిసి పోతాయి. గుడ్లగూబలు అనాదిగా మానవ సంస్కృతిలో భాగమయ్యాయి. ప్రాచీన గ్రీస్‌లో వీటిని జ్ఞానం అందించే దేవత ఎథీనాగా భావించి పూజించారు. గుడ్లగూబల్లో ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ రకాలున్నాయి. అవి మనుషుల మీద దాడిచేయవు.

మరిన్ని వీడియోల కోసం :

ఏకాంతం కోసం లాడ్జి‌లో దిగిన ప్రేమజంట.. కట్ చేస్తే.. వీడియో

కన్నబిడ్డకోసం తండ్రి సాహసం.. చిరుతతో పోరాడి వీడియో

పాతకారులోంచి భయంకర శబ్ధాలు.. సిబ్బంది పరుగో పరుగు వీడియో