మన ఉస్మానియాకు అంతర్జాతీయ హంగులు.. కళ్లు చెదిరే రీతిలో మాస్టర్ ప్లాన్స్

Updated on: Dec 12, 2025 | 5:32 PM

సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ₹1000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. శిథిల హాస్టళ్లను కూల్చి, నూతన ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను నిర్మించనున్నారు. హార్ట్‌ఫుల్‌నెస్‌ ఫౌండేషన్‌ ప్రాచీన వారసత్వాన్ని కాపాడుతూ, ఆధునిక వసతులు కల్పించే మాస్టర్ ప్లాన్‌ను సమర్పించింది. ఇది ఓయూ క్యాంపస్‌కు నూతన శోభను తేనుంది.

ఉస్మానియా యూనివర్సిటీలో.. రూ.1000 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. శిథిలావస్థకు చేరుకున్న హాస్టళ్లను కూల్చివేసి.. వాటి స్థానంలో ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌ భవన సముదాయాన్ని నిర్మించనున్నారు. ఇంజినీరింగ్‌ కాలేజీలో అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్, ఆడిటోరియం, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇతర అభివృద్ధి పనులకు సభా వేది నుంచే సీఎం శంకుస్థాపన చేశారు. ఓయూకి రెండోసారి వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి సిబ్బంది నియామకం, రాబోయే రోజుల్లో కల్పించ తలపెట్టిన సదుపాయాలు మీద కీలక ప్రకటన చేశారు. ఉస్మానియా వర్సిటీలో మౌలిక సదుసాయల అభివృద్ధికి DPR రెడీ అవుతున్నవేళ, ప్రభుత్వం ముందుకు మూడు కీలక ప్రతిపాదనలు వచ్చాయి. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త దాజీకి చెందిన హార్ట్‌ఫుల్‌నెస్‌ ఫౌండేషన్‌ ఒక ప్రతిపాదనను తయారుచేసింది. ప్రాచీన చరిత్ర ఆనవాళ్లు చెదిరి పోకుండా, పర్యావరణ హితమైన విధానాలతో ఆధునిక నిర్మాణాలు చేయటంలో పేరొందిన ఈ సంస్థ దేశవ్యాప్తంగా పలు కీలక ప్రాజెక్టులను చేపట్టి మంచి పేరు సంపాదించింది. వీటిలో అనేక ప్రభుత్వ ప్రాజెక్టులు, సంస్థాగత క్యాంపస్‌లు, ల్యాండ్‌స్కేప్‌లు, ప్రముఖ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. ప్రకృతికి, ప్రజలకు మధ్య సమన్వయాన్ని తీసుకురావడం.. వీరి నిర్మాణాల్లో కనిపించే మరో విశేష అంశం. తెలంగాణ అస్తిత్వ ప్రతీకల్లో ఒకటిగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీని 1918లో మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ స్థాపించారు. 1969 తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో ఈ వర్సిటీ క్యాంపస్.. కీలక పాత్ర పోషించింది. సాంస్కృతిక వారసత్వం, శిల్పకళా వైభవానికి చిహ్నంగా ఉన్న ఓయూ క్యాంపస్‌ మలిదశ తెలంగాణ ఉద్యమానికీ కేంద్ర బిందువుగా నిలిచింది. ఎంతో ప్రాచీన చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలోని వారసత్వ కట్టాడాలకు ఎలాంటి నష్టం జరగకుండానే, భవిష్యత్ అవసరాలు తీర్చేలా హార్ట్‌ఫుల్‌నెస్‌ ఫౌండేషన్‌.. సరికొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. 14 కిలోమీటర్ల విస్తీర్ణం గల క్యాంపస్‌లో తనదైన నమూనాలో.. హాస్టల్స్‌, అడ్మినిస్ట్రేటివ్‌, అకడమిక్ బ్లాక్‌ల నిర్మాణం చేపట్టి..యూనివర్సిటీ క్యాంపస్‌ ను ఆధునీకరణకు తన నమూనాను ప్రతిపాదించింది. ఇందులో భాగంగా క్యాంపస్‌లోకి వచ్చే వారికి స్వాగతం పలికే ప్రవేశ ద్వారాల నుంచి.. ఓపెన్‌ ఎయిర్ ఆడిటోరియం, స్టేడియం, ఇండోర్‌ స్విమ్మింగ్‌ పూల్‌, బ్యాడ్మింటన్‌ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు సైకిల్, వాకింగ్ ట్రాక్‌లు, క్రీడా సదుపాయాలు, హెల్త్ కేర్ సెంటర్, కన్వెన్షన్ హాల్ వంటి ఆధునిక హంగులను కల్పించనున్నారు. యూనివర్సిటీ కేంపస్‌‌కు కేంద్రబిందువైన ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం, దాని పరిసరాలను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు నూతన ప్రణాళికలో పలు సూచనలు చేశారు. కేంపస్‌లో అంతర్గత రోడ్లు, పలు విభాగాలను కనెక్ట్ చేస్తూ మెరుగైన మార్గాల ఏర్పాటు గురించీ ఈ ప్రణాళిలో ప్రస్తావించారు. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాలలో అమరులైన విద్యార్థుల పేర్లను గ్రానైట్ రాళ్ల మీద చెక్కి, ఒక స్మారకం రూపంలో వారి పోరాట చరిత్రను శాశ్వతం చేయనున్నారు. ఈ సదుపాయాలతో కూడిన సవివరమైన మాస్టర్‌ ప్లాన్‌ను స్కిల్‌ అండ్‌ అసోసియేట్స్‌ ప్రభుత్వానికి సమర్పించారు. ఇవి గాక మరో రెండు ప్రతిపాదనలూ ప్రభుత్వం ముందు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ సమీక్షించి.. అంతిమంగా వీటిలో ఒకదానిని ప్రభుత్వం ఆమోదించనుంది. నమూనాల రూపకల్పనలో విద్యార్థులు, ప్రొఫెసర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నారు. యూనివ‌ర్సిటీ ప‌రిధిలో ఇప్ప‌టికే ఉన్న జ‌ల వ‌న‌రుల‌ను సంర‌క్షిస్తూనే నూత‌న జ‌ల వ‌న‌రుల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోనున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాహనదారులకు అలర్ట్‌.. ఇలాంటివారికి నో పెట్రోల్‌

Gold Price Today : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

వాతావరణశాఖ అలర్ట్‌.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త

హిట్ కావాలంటే సినిమా వాయిదా పడాల్సిందే.. కోలీవుడ్ హీరోల నయా స్ట్రాటజీ

Hrithik Roshan: ఆ సినిమాకు రివ్యూ ఇచ్చాడు.. ఇప్పుడు ఫుల్ ట్రోల్ అవుతున్నాడు.. ఎందుకు సర్ మనకి ఇవన్నీ..