తొక్కే కదా అని లైట్‌ తీసుకోకండి.. ఇలా వాడి చూడండి

Updated on: Nov 17, 2025 | 4:49 PM

పడేసే నారింజ తొక్కలతో చర్మానికి అద్భుత ప్రయోజనాలున్నాయి. విటమిన్-సి సమృద్ధిగా ఉండే నారింజ తొక్కల పొడిని వివిధ సహజ పదార్థాలతో కలిపి ఫేస్ ప్యాక్స్ లా వాడవచ్చు. ఇది చర్మంపై ట్యాన్‌ను తొలగిస్తుంది, మృతకణాలను రిమూవ్ చేస్తుంది, ముఖాన్ని కాంతివంతంగా, అందంగా చేస్తుంది. సహజసిద్ధమైన ఈ చిట్కాలతో మెరిసే, ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందండి.

మనిషి ఆరోగ్యానికి తాజా పండ్లు, కూరగాయలు ఎంతో మేలు చేస్తాయి. అందుకే వైద్యులు, ఆహార నిపుణులు కూడా పండ్లు, కూరగాయలు తీసుకోమని చెబుతారు. చర్మ సంరక్షణ కూడా ఆరోగ్యంలో భాగమే. ఆరోగ్య రక్షణలో భాగంగా సి విటమిన్‌ కలిగిన పండ్లను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. ఇది ఆరోగ్యాన్ని, చర్మాన్ని కాపాడటంలో ఎంతగానో సహకరిస్తాయి. ఈ సిట్రస్‌ పండ్లలో ప్రధానమైనది నారింజపండు. ఇందులో సి విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. అయితే మనం నారింజపండును తిని తొక్కను పడేస్తాం. కానీ ఈ తొక్కవల్ల కూడా చర్మానికి ఎంతో ప్రయోజనముందంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మనం తొక్కేకదా అని పడేసే నారింజపండు తొక్కలతో అనేక లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అందమైన చర్మానికి ఈ తొక్కలు ఎంతగానో దోహదం చేస్తాయి. నారింజ తొక్కలను నీడలో ఆరబెట్టి పొడి చేసుకొని ఓ డబ్బాలో భద్రపరచుకోవాలి. ఒకచెంచా నారింజపండు తొక్కల పొడిలో ఒక చెంచా బియ్మం పిండి, రోజ్‌వాటర్‌ కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత చల్లని నీటితో క్లీన్ చేసుకోవాలి. ఇది ముఖంపై ఉన్న టాన్‌ తొలగిస్తుంది. మృతకణాలను రిమూవ్‌ చేస్తుంది. అలాటే నారింజ తొక్కల పొడిలో కాస్త పెరుగు, తేనె కలిపి కూడా ముఖానికి రాసుకోవచ్చు. దీనివల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. ఒక స్పూన్ శనగ పిండి తీసుకుని, అందులో అరస్పూన్ నారింజ తొక్కల పొడి, కొన్ని చుక్కల నిమ్మరసం, కొద్దిగా రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లా చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత క్లీన్‌ చేసుకుంటే ముఖానికి మంచి గ్లో వస్తుంది. అలాగే నారింజ తొక్కల పొడిలో ముల్తానీమిట్టి, చిటికెడు పసుపు, పాలు వేసి కలిపండి..ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని పది నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. నారింజ తొక్కల పొడిలో కొద్దిగా తాజా అలోవెరా జెల్, నాలుగైదు చుక్కల నిమ్మరసం, రోజ్‌వాటర్‌ కలిపి కొంచెం గట్టిగా ఉండే పేస్ట్‌లా చేసుకొని దానిని ముఖానికి స్క్రబ్‌లా ఉపయోగించవచ్చు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. స్కిన్‌కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ జనం మారరా ?? కోట్లాది మంది పాస్‌వర్డ్‌ ఒకటే !!

రూ.20 వేలా ?? ఐఫోన్‌ పౌచ్‌పై ట్రోలింగ్‌

మీ కళ్లు చెబుతాయి ఇక.. మీ వ్యాధులేమిటో !!

తండ్రి ఆస్తి కోసం కరిష్మా కపూర్ కూతురి గొడవ కోర్టు అసహనం

అవి అశ్లీలమైన ఫోటోలు.. నా కొడుకు చూస్తే ఎలా ?? దయచేసి తొలగించండి