30 పైసలకు పడిపోయిన కిలో ఉల్లి ధర.. రైతు ఆత్మహత్య
ఉల్లిగడ్డ కోస్తే కన్నీళ్లు వస్తాయి. అయితే ఇప్పుడు వినియోగదారులు కాకుండా అది పండించిన రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అంతే కాదు ఉల్లి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఉల్లి రైతుల కష్టాలు దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు కిలోకు 30 పైసలకు పడిపోయింది. ఈ స్థాయి పతనం కర్నూలు మార్కెట్ చరిత్రలో ఎన్నడూ చూడలేదని అన్నదాతలు లబొదిబోమంటున్నారు.
లక్షలు పెట్టి పంట సాగు చేసిన రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మార్కెట్‌లో రైతులకు కొంత ఊరట ఇచ్చిన ఉల్లి పంట, ఇప్పుడు వారి కళ్లలో నీళ్లు తెప్పిస్తోంది. నిన్నటి వరకు క్వింటాలుకు వేలల్లో ధర పలికిన ఉల్లి, ఇప్పుడు కిలోకు 30 పైసలకు పడిపోయింది. ఈ స్థాయి పతనం కర్నూలు మార్కెట్ చరిత్రలో ఎన్నడూ చూడలేదని అన్నదాతలు వాపోతున్నారు. గతేడాది ఉల్లి క్వింటాలుకు సుమారు రూ.6,000 వరకు ధర వచ్చింది. ఆ రాబడి రైతుల గృహాల్లో సంతోషాన్ని నింపింది. కానీ ఈసారి పరిస్థితి తారుమారైంది. కిలో ఉల్లిని మార్కెట్‌కు తీసుకెళ్లినా, కొనేవారు లేరు. వ్యాపారులు వేలంలో పాల్గొనకపోవడంతో రైతులు తెచ్చిన సరుకే తిరిగి మిగిలిపోతోంది. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన ఉల్లిని విక్రయించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటా రూ.1,200 మద్దతు ధరతో ఉల్లి కొనుగోలు చేస్తున్నారు. వేలంలో కొనుగోలు చేయని సరకును మరోమారు వేలం వేసినా ఎవరూ కొనే పరిస్థితి లేదు. ప్రభుత్వం క్వింటా రూ.1200కు కొనుగోలు చేసిన ఉల్లిని వేలం ద్వారా వ్యాపారులకు అతి తక్కువకే విక్రయించడం ద్వారా ఇప్పటికే రూ.కోటిన్నర నష్టం వాటిల్లింది. వేలంలో కొనుగోలు చేయని సరకును మరోమారు వేలం వేసినా ఎవరూ కొనే పరిస్థితి లేదు. వ్యాపారులు కొనుగోలు చేయనిది, కుళ్లిపోయిన ఉల్లి ద్వారా మరో రూ.2 కోట్లు వేస్ట్ అయినట్లే. మరోవైపు వెల్దుర్తి మండలం కోసనేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి ఉల్లి రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూ.2 లక్షలతో ఉల్లి సాగు చేసిన రైతు రామచంద్రుడు.. ఉల్లి ధర దారుణంగా పడిపోవడంతో మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పులు తీరక ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. దీంతో స్థానికంగా విషాదచాయలు అలముకున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెగా డీఎస్సీ ఎంపిక జాబితా విడుదల..
క్షుద్ర పూజలపై ఒక్కటైన గ్రామస్తులు.. ఏం చేశారంటే
TOP 9 ET News: పవన్‌ను ఫ్యాన్సే శత్రువుల చేతిలో పెడుతున్నారా?
ఉన్నది వారమే అయినా.. గట్టిగానే సంపాదించిన శ్రష్టి
బంపర్ ఆఫర్ ! ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ! ఏం ప్లాన్ గురూ..!