క్యూలో నిలబడి రూ.5ల భోజనం చేసిన కలెక్టర్
పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వాలు తక్కువ ధరకే మధ్యాహ్న భోజనం అందించే పథకాలు చేపట్టారు. రూ.5లకే కడుపునిండా భోజనం పెడుతున్న ఈ పథకాలు పేదలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ క్రమంలో ఈ పథకం ఎలా అమలవుతోంది.. నాణ్యమైన ఆహారం అందిస్తున్నారా లేదా అని చెక్ చేయాలనుకున్నారు ఆ జిల్లా కలెక్టర్.
పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వాలు తక్కువ ధరకే మధ్యాహ్న భోజనం అందించే పథకాలు చేపట్టారు. రూ.5లకే కడుపునిండా భోజనం పెడుతున్న ఈ పథకాలు పేదలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ క్రమంలో ఈ పథకం ఎలా అమలవుతోంది.. నాణ్యమైన ఆహారం అందిస్తున్నారా లేదా అని చెక్ చేయాలనుకున్నారు ఆ జిల్లా కలెక్టర్. వెంటనే ఓ సామాన్యుడిలా క్యూ లైన్‌లో వెళ్లి రూ.5ల అల్పాహారం కొనుక్కొని అందరితో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది. విజయవాడ పడమట హైస్కూల్ రోడ్ లోని అన్న క్యాంటీన్ ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ఆకస్మికంగా సందర్శించారు. అక్కడి నిర్వహణను ప్రత్యక్షంగా పరిశీలించారు. అల్పాహారం కోసం వచ్చిన ప్రజలతో కలెక్టర్ లక్ష్మీశా ఆప్యాయంగా మాట్లాడారు. ఆహారం నాణ్యత ఎలా ఉంది, రుచిగా, వేడిగా ఉందా లేదా అని అల్పాహారం తింటున్నవారిని అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్ లోని ఆహార పదార్థాలు పట్టిక, టోకెన్ కౌంటర్ , డైనింగ్ ఏరియా, తాగునీటి నాణ్యతను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అన్నా క్యాంటీన్ నిర్వాహకులతో ముచ్చటించిన జిల్లా కలెక్టర్ పరిసరాలు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. మెనూ ప్రకారం ఆహారం అందుబాటులో ఉండాలని కలెక్టర్ లక్ష్మీశా ఆదేశాలు జారీ చేశారు. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం ఎంతో పవిత్రమైన సేవ.. అలాంటి మంచి కార్యక్రమంలో పని చేయడం అదృష్టమని నిబద్ధతతో సేవ చేయాలని కలెక్టర్ సూచించారు. అన్న క్యాంటీన్ సేవలపై ప్రజా అభిప్రాయాలను సేకరించేందుకు క్యూఆర్ కోడ్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజల అభిప్రాయాలు ఆధారంగా సేవలను మరింత మెరుగుపరుస్తామని కలెక్టర్ లక్ష్మీశా అన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీ ధైర్యానికో దండంరా సామీ.. దాన్ని పట్టుకుని ఆలా ఎలా వెళ్ళావు రా..
పదో తరగతి అర్హతతో రైల్వేలో 4,116 ఉద్యోగాలు
ఇంటింటికి బొట్టు పెట్టి ఇందిరమ్మ చీరల పంపిణీ.. ఎవరు అర్హులంటే
