వందేభారత్‌.. 180 కి.మీ స్పీడ్‌.. గ్లాస్‌ వణకలేదు..నీళ్ళు తొణకలేదు

Updated on: Jan 03, 2026 | 11:33 AM

వందే భారత్ స్లీపర్ రైలు 180 Kmph వేగంతో జరిగిన స్పీడ్ ట్రయల్స్‌లో, వాటర్ టెస్ట్‌లో విజయవంతమైంది. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ వీడియోను విడుదల చేశారు. నిద్రించేటప్పుడు ఎలాంటి కుదుపులు లేకుండా ప్రశాంతమైన ప్రయాణం అందించడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారు. విలాసవంతమైన 16 కోచ్‌లు, కవచ్ భద్రతా వ్యవస్థ దీని ప్రత్యేకతలు.

సుదూర ప్రయాణాలు చేసే రైలు ప్రయాణికులకు శుభవార్త. వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కేందుకు రెడీ అయింది. తాజాగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో జరిగిన స్పీడ్ ట్రయల్స్‌లో సక్సెస్‌ అయింది. అందులో భాగంగా రైలును గంటకు 182 కిలోమీటర్ల స్పీడ్‌లో రన్‌ చేస్తూ.. ‘వాటర్‌ టెస్ట్‌’ నిర్వహించారు. భారతీయ రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ రూపొందించిన వందే భారత్ స్లీపర్ రైలు తన సామర్థ్యాన్ని మరోసారి చాటుకుంది. రాజస్థాన్‌లోని కోటా – నాగ్డా సెక్షన్ల మధ్య నిర్వహించిన హై స్పీడ్ ట్రయల్స్‌లో ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని నమోదు చేసి రికార్డు సృష్టించింది. కేవలం వేగాన్నే కాకుండా.. రైలు ప్రయాణంలో ఉండే స్థిరత్వాన్ని నిరూపించడానికి రైల్వే శాఖ వాటర్ టెస్ట్ నిర్వహించింది. రైలును గంటకు 182 కిలోమీటర్ల స్పీడ్‌లో రన్‌ చేస్తూ.. ఈ ‘వాటర్‌ టెస్ట్‌’ నిర్వహించారు. రైలు గరిష్ఠ వేగంతో వెళుతున్నప్పుడు.. మూడు నిండా నీరున్న గ్లాసులను ఒకదానిపై ఒకటి ఉంచి పరీక్షించారు. ఈ క్రమంలో అందులో నీరు ఏమాత్రం తొణకలేదు. దానికి సంబంధించిన వీడియోను రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వందే భారత్ స్లీపర్ కొత్త తరం టెక్నాలజీకి ఇదే నిదర్శనమని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రయాణికులు నిద్రించే సమయంలో ఎలాంటి కుదుపులు లేకుండా.. అత్యంత ప్రశాంతమైన అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ స్లీపర్ రైలు వెర్షన్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఈ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉన్నాయి. వీటిని విలాసవంతమైన సౌకర్యాలతో.. అత్యాధునిక టెక్నాలజీతో తీర్చిదిద్దారు. ప్రయాణికుల కోసం 11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ ఏసీ కోచ్‌లను ఏర్పాటు చేశారు. భద్రత కోసం స్వదేశీ టెక్నాలజీ అయిన కవచ్ వ్యవస్థను, విమాన తరహాలో బయో వాక్యూమ్ టాయిలెట్లు, సెన్సార్ లైటింగ్ వంటి ప్రత్యేకతలను ఈ వందే భారత్ స్లీపర్ రైలులో ఏర్పాటు చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

LPG Gas Cylinder: బిగ్‌ షాక్‌.. భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

రికార్డు స్థాయిలో జీఎస్టీ ఆదాయం.. డిసెంబరులో భారీ వసూళ్లు

అయ్యబాబోయ్‌.. రూ.6 లక్షల బిర్యానీలు హాంఫట్‌

ఎంతకు తెగించావురా !! రీల్స్‌ కోసం ఇంత రిస్క్‌

ఇంటిలోకి ప్రవేశించిన చిరుత.. సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌