మన కరెన్సీపై పదేళ్ల ఆంక్షలకు తెర.. రూ.500 నోట్లకు నేపాల్ గ్రీన్ సిగ్నల్
భారతీయ పర్యాటకులు, సరిహద్దు వ్యాపారులకు నేపాల్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకపై కొత్త రూ.200, రూ.500 భారత కరెన్సీ నోట్లను గరిష్ఠంగా రూ.25,000 వరకు నేపాల్‌లోకి తీసుకెళ్లేందుకు అనుమతించింది. 2016 తర్వాత అమల్లో ఉన్న ఆంక్షలను సడలిస్తూ నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్-నేపాల్ సరిహద్దు వాణిజ్యం, పర్యాటక రంగానికి ఊరట లభించనుంది.
భారతీయ పర్యాటకులు, సరిహద్దు వ్యాపారులకు నేపాల్ ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఇకపై తమ దేశంలో భారతీయ రూ.200, రూ.500 నోట్లను అధికారికంగా వినియోగించుకోవచ్చని నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ప్రతినిధి గురు ప్రసాద్ పౌడెల్ ప్రకటించారు. 2016 నవంబర్ 9న భారత్‌లో పెద్ద నోట్ల రద్దు జరిగినప్పటి నుంచి నేపాల్ కేవలం రూ.100 నోట్లను మాత్రమే అనుమతిస్తూ వస్తోంది. అయితే తాజా నిర్ణయంతో సుదీర్ఘకాలంగా ఉన్న ఆంక్షలను సడలించింది. కొత్త నిబంధనల ప్రకారం.. 2016 నవంబర్ 9 లేదా ఆ తర్వాత జారీ చేసిన కొత్త రూ.200, రూ.500 నోట్లను ఒక్కో వ్యక్తి గరిష్ఠంగా రూ.25,000 వరకు నేపాల్‌లోకి తీసుకెళ్లవచ్చు లేదా తీసుకురావచ్చు. అయితే, పెద్ద నోట్ల రద్దు కంటే ముందు నాటి పాత నోట్లపై నిషేధం యథాతథంగా కొనసాగుతుంది. అలాగే భారత్ మినహా ఇతర మూడో దేశాల నుంచి తీసుకువచ్చే భారత కరెన్సీని అనుమతించబోమని బ్యాంక్ స్పష్టం చేసింది. ఈ సడలింపుల వల్ల భారత్-నేపాల్ సరిహద్దుల్లో ఆర్థిక లావాదేవీలు సులభతరం కావడంతో పాటు పర్యాటకులు, చిన్న తరహా వ్యాపారులకు ఎంతో ప్రయోజనం కలగనుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇల్లు కొనడానికి పీఎఫ్ డబ్బులు తీస్తున్నారా? ఈ వార్త మీకోసమే!
ఓరి మీ కక్కుర్తి కూలా.. ఇదేం పనిరా సామీ!
ఇకపై నన్ను అలా పిలవొద్దు.. పవన్ అర్ధాంగి ఎమోషనల్ పోస్ట్
గుడ్‌న్యూస్.. బుక్ చేసిన 4 గంటల్లోనే ఎల్పీజీ సిలిండర్ డెలివరీ!
అంతరిక్షంలో మెరిసిన తొలి భారత వజ్రం.. విక్రమ్-1తో స్కైరూట్ చరిత్ర!
