Rama Nandana: అమ్మో.. ఆ రోజును అస్సలు మరచిపోలేను
శంషాబాద్ విమానాశ్రయంలో సెప్టెంబర్ 7న జరిగిన పరిణామాల తర్వాత ‘నందూస్ వరల్డ్’ రమా నందన తొలిసారి సోషల్ మీడియాలో స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో తాను తప్పు చేయలేదని, కుటుంబ గౌరవం కోసం నిజం బయటకు వచ్చే వరకు పోరాడతానని పేర్కొన్నారు. తన కుటుంబానికి సంబంధం లేని వ్యవహారంలో పేర్లను కావాలనే లాగుతున్నారని ఆరోపించారు. యూకే జాబ్స్, వీసా స్పాన్సర్‌షిప్ వివాదం నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
‘నందూస్ వరల్డ్’ రమా నందన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. తనపై వచ్చిన తీవ్ర ఆరోపణలు, సెప్టెంబర్ 7న శంషాబాద్ విమానాశ్రయంలో జరిగిన అనూహ్య పరిణామాల అనంతరం ఆమె తొలిసారి రియాక్టైంది. తన పోస్టులో రమా నందన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆమె తన పోస్టులో ఏం రాసుకొచ్చింది.. అంఒటే.. “సెప్టెంబర్ 7న నా జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఎదురవడానికి కొద్ది నిమిషాల ముందే నేను విమానాశ్రయంలో అడుగుపెట్టాను. నేనేదో టీవీ షోల కోసమో, పబ్లిసిటీ కోసమో ముందుకు రాలేదు. నిజానికి ఎన్నో అవకాశాలు వచ్చినా పక్కన పెట్టి, ముందుగా ఈ సమస్యను పరిష్కరించాలని నేనే స్వయంగా ముందుకొచ్చాను. మా కుటుంబానికి ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంలోకి మా పేర్లను, పరువును కావాలనే లాగుతున్నారు.నేను తప్పు చేయలేదని నాకు తెలుసు. నిజం కోసం నిలబడతాను, ఎదురయ్యే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. రాబోయే రోజుల్లో అన్ని నిజాలు బయటకు వస్తాయి. దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు కచ్చితంగా జవాబుదారీ అవుతారు. ఇది నేనేదో సీన్ క్రియేట్ చేయడం కోసం కాదు.. నా కుటుంబ గౌరవాన్ని, నిజాన్ని కాపాడుకోవడం కోసం చేస్తున్న పోరాటం. కన్నీళ్లు రావచ్చు, ఎంతో బాధ కలగవచ్చు, గడ్డు పరిస్థితులు ఎదురవ్వచ్చు.. కానీ నేను చేయని తప్పుకు ఎప్పటికీ తలదించను. కుంగిపోతానేమో కానీ ఓడిపోను.. పోరాడతాను” అని రమా నందన తన పోస్టులో రాసుకొచ్చారు. యూకే జాబ్స్, వీసా స్పాన్సర్‌షిప్ వివాదంలో కేసులు నమోదై, ఎయిర్‌పోర్టులో లుకౌట్ నోటీసుల వ్యవహారం నడిచిన తర్వాత ఆమె ఈ పోస్ట్ చేయడం గమనార్హం. తనపై కావాలనే కుట్ర జరిగిందని, అసలు దోషులు వేరే ఉన్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె నిర్దోషిత్వాన్ని నమ్ముతూ ఫాలోవర్లు మద్దతుగా కామెంట్లు పెడుతుండగా, మరోవైపు బాధితులు మాత్రం చట్టపరంగా నిజాలు తేలాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. రూ.35కే కిలో ఉల్లిగడ్డలు.. ఆధార్ ఉంటే చాలు!
Rabi Crops: రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపు!
45 లక్షల కట్నం, బంగారం ఇచ్చినా తీరని దాహం.. వరకట్న వేధింపులకు నవవధువు బలి
Urvashi Rautela: AI సంస్థకి హీరోయిన్ ఝలక్.. రూ.7000 కోట్లు డిమాండ్
ఈబీ-5 గ్రీన్‌కార్డు ఫీజులపై ‘డబుల్’ షాక్.. భారతీయులపై ఎఫెక్ట్
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్

