Mystery Deaths: అసలు ఆ గ్రామానికేమైంది..? తురకపాలెంలో పర్యటించనున్న ఐసీఏంఆర్ బృందం
తురకపాలెంలో అంతుచిక్కని మరణాలకు కారణాలేంటి...? 60 రోజుల్లో 30 మంది అకారణంగా చనిపోవడమేంటి...? అసలా గ్రామానికేమైంది..? అన్న దానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. మెడికల్ ఎమర్జెన్సీగా భావించి చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రేపటి వరకు గ్రామంలోని అందరి హెల్త్ ప్రొఫైల్ సిద్దం చేయాలని ఆదేశించారు.
తురకపాలెంలో అంతుచిక్కని మరణాలకు కారణాలేంటి..? 60 రోజుల్లో 30 మంది అకారణంగా చనిపోవడమేంటి…? అసలా గ్రామానికేమైంది..? అన్న విషయాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. మెడికల్ ఎమర్జెన్సీగా భావించి చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రేపటి వరకు గ్రామంలోని అందరి హెల్త్ ప్రొఫైల్ సిద్దం చేయాలని ఆదేశించారు. దీంతోపాటు గ్రామం మొత్తానికి ఆహారం, నీరు సరఫరా చేయాలని సూచించారు. దీంతో ఊరి వారందరినీ సిబ్బంది ఆహారం పంపిణీ చేస్తున్నారు. సోమవారం లోపు ఆరోగ్య వివరాలు సేకరించాలని సీఎం ఆదేశించారు. ఆ దిశగా సమాచారాన్ని సిబ్బంది సేకరిస్తున్నారు.
తురకపాలెంలో పర్యటించిన ఎయిమ్స్ బృందం.. ఇప్పటికే బ్లడ్ శాంపిల్స్ సేకరించింది. కాగా.. సోమవారం ICMR బృందం గ్రామంలో పర్యటించనుంది. మట్టి నమూనాలను సేకరించనున్న బృంద సభ్యులు.. మరణాలపై కారణాలను అణ్వేషించనున్నారు.
కాగా.. ఇప్పటికే అనారోగ్యానికి గురైన నలుగురికి GGHలో చికిత్స కొనసాగుతోంది. కాగా. గ్రామంలో మరొకరికి మెలియాయిడోసిస్ గుర్తించారు. దీంతో గ్రామస్థుల్లో ఆందోళన మరింత పెరిగింది.
