Afroz Shah: పర్యావరణ పరిరక్షణలో అఫ్రోజ్ అందరికీ ఆదర్శం.. ప్రధాని మోదీ, ఐరాస ప్రశంసలు..

Updated on: Jun 26, 2023 | 7:35 PM

అఫ్రోజ్ షా.. సముద్ర తీరాల్లో ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అఫ్రోజ్ షా చేవలను ఇటు ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని అటు ఐక్యరాజ్య సమితి వరకు ఎందరో ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణ ఏ ఒక్కరిదో కాదు.. మనందరి బాధ్యతగా అఫ్రోజ్ చాటుతున్నాడు.

అఫ్రోజ్ షా.. సముద్ర తీరాల్లో ప్లాస్టిక్ నిర్మూలనకు కృషి చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అఫ్రోజ్ షా చేవలను ఇటు ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని అటు ఐక్యరాజ్య సమితి వరకు ఎందరో ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణ ఏ ఒక్కరిదో కాదు.. మనందరి బాధ్యతగా అఫ్రోజ్ చాటుతున్నాడు. 50వ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ‘మై ఇండియా – మై లైఫ్‌ గోల్స్‌’ ప్రచారంలో కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యమైన టీవీ9.. అఫ్రోజ్ సేవలపై అందిస్తున్న ప్రత్యేక వీడియో కథనమిది.

అఫ్రోజ్ వృత్తిరీత్యా న్యాయవాది. ముంబైలోని బీచ్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలను చూసిన తర్వాత చాలా కాలంగా ఏదైనా చేయాలనే కోరిక కలిగింది. 2016 సంవత్సరంలో.. అఫ్రోజ్ ముంబై సముద్రతీరం నుండి చెత్తను తొలగించే పనిని ప్రారంభించాడు. అలాగే సముద్రాన్ని శుభ్రంగా ఉంచాలని ప్రజల్లో అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించాడు. అతని కృషి ఇప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తోంది. అఫ్రోజ్ కృషిని ప్రధాని మోదీ గుర్తించగా, మరోవైపు UN కూడా ప్రశంసించింది.

Published on: Jun 26, 2023 06:50 PM