My India My Life Goals: ఎల్‌ఓసీ నుంచి మొదలుపెట్టి కార్గిల్‌ వరకు మొక్కలు నాటుతాం..

Updated on: Jun 30, 2023 | 1:59 PM

Mohammad Iqbal Lone: పర్యావరణ పరిరక్షణే అతని జీవితం.. దీనికోసం ఆయన ఏకంగా భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో లక్షలాది మొక్కలు నాటారు. అంతేకాకుండా ఎన్నో రకాల మొక్కలను స్థానికులకు, రక్షణ అధికారులకు అందిస్తుంటారు.. ఆయన ఎవరో కాదు.. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త మహమ్మద్ ఇక్బాల్ లోన్‌..

Mohammad Iqbal Lone: పర్యావరణ పరిరక్షణే అతని జీవితం.. దీనికోసం ఆయన ఏకంగా భారత్ – పాకిస్తాన్ సరిహద్దుల్లో లక్షలాది మొక్కలు నాటారు. అంతేకాకుండా ఎన్నో రకాల మొక్కలను స్థానికులకు, రక్షణ అధికారులకు అందిస్తుంటారు.. ఆయన ఎవరో కాదు.. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త మహమ్మద్ ఇక్బాల్ లోన్‌.. ఆయన గత కొన్నేళ్ల నుంచి కశ్మీర్‌లో పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భారత ప్రభుత్వం ‘మై ఇండియా – మై లైఫ్‌ గోల్స్‌’ పేరుతో లైఫ్‌స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ మూవ్‌మెంట్‌ – లైఫ్‌ అనే నినాదంతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తుండగా.. ఈ ఉద్యమంలో టీవీ9 సైతం భాగస్వామ్యమైంది. ఈ నేపథ్యంలో ఇక్బాల్ లోన్ చినార్ మొక్కలను ఎలా నాటుతారో ప్రత్యేకంగా వివరించారు. ఇక్బాల్ లోన్ మాట్లాడుతూ.. వర్షాలు కురిసే మాసాలలో ఐదు వేలకు పైగా చినార్‌ మొక్కలను నాటడం చేస్తుంటాం. ఎల్‌ఓసీ నుంచి మొదలుపెట్టి కార్గిల్‌ వరకు నాటుకుంటూ వెళతాం. చినార్‌ వల్ల లాభం ఏంటంటే.. చెట్టు జీవితకాలం 300 నుంచి 400 సంవత్సరాలు.. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకుంటున్నాం.. అడవుల్లో పచ్చదనం పెంపొందాలి అంటే మనమంతా కృషి చేయాలి.. జల్‌ జంగల్ జమీన్‌.. ఏవీ లేకపోతే.. జీవజాలం మనుగడ అసంభవం.. అంటూ ఇక్బాల్ లోన్ పేర్కొన్నారు.