My India My LiFE Goals: పెళ్లి చేసుకోవడం కూడా మరిచిపోయాను.. నా జీవితం సముద్రానికే అంకితం..

Updated on: Aug 07, 2023 | 9:43 PM

Green Warrior Bichi Bhai: ఒడిశాకు చెందిన 37 ఏళ్ల బిచిత్రానంద్ బిస్వాల్.. సాదాసీదా వ్యక్తి.. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సుపరిచితం.. పర్యావరణ ప్రేమికుడైన అతన్ని అందరూ బిచి భాయ్ అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు. పర్యావరణ వేత్త బిచి భాయ్ తాబేళ్ల సంరక్షించడం, తీరంలో మొక్కలు నాటి తద్వారా వరదపోటు నుంచి గ్రామాలను సంరక్షించడం ఇతని దినచర్య..

Green Warrior Bichi Bhai: ఒడిశాకు చెందిన 37 ఏళ్ల బిచిత్రానంద్ బిస్వాల్.. సాదాసీదా వ్యక్తి.. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సుపరిచితం.. పర్యావరణ ప్రేమికుడైన అతన్ని అందరూ బిచి భాయ్ అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు. పర్యావరణ వేత్త బిచి భాయ్ తాబేళ్ల సంరక్షించడం, తీరంలో మొక్కలు నాటి తద్వారా వరదపోటు నుంచి గ్రామాలను సంరక్షించడం ఇతని దినచర్య.. పర్యావరణ పరిరక్షణ, జంతు సంరక్షణ గురించి ఎప్పటినుంచి ఈ  ఆలోచన వచ్చింది.. ఎప్పటినుంచి మొదలు పెట్టారు.. అనే విషయాలను ఆయన మాటల్లో వినండి.. ‘‘1996లో ఎనిమిదో క్లాస్‌ చదువుతున్న రోజుల్లో బీచ్‌కు రోజూ వచ్చేవాడిని. అప్పట్లో చాలా తాబేళ్ళు మరణించడం చూసాను. వాటిని సంరక్షించాలన్న ఆలోచనతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాను. గొప్ప సంపదగా భావించే తాబేళ్లు .. తీరంలో గుడ్లు పెట్టి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి. గుడ్లను సేకరిస్తాం.. వాటిని సంరక్షిస్తాం. 45 రోజుల తర్వాత పిల్లలు బయటికి వస్తాయి. పిల్ల తాబేళ్ల సంఖ్యను లెక్కపెట్టి .. తీసుకెళ్ళి సురక్షితంగా సముద్రంలో వదిలిపెడతాం. నా జీవితం సముద్రానికే అంకితం. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవడం కూడా మరిచాను. అటవీ ప్రాణుల సంరక్షణలో రోజులు గడిచిపోతున్నాయి.’’ అంటూ వివరించారు.