మై హోం గ్రూప్‌కు మరో విశిష్ట గుర్తింపు.. 7 ఎక్సలెన్స్ అవార్డులను సొంతం చేసుకున్న మహాసిమెంట్
మై హోమ్ గ్రూప్‌కు చెందిన మహా సిమెంట్, QCFI జాతీయ ఎన్విరాన్‌మెంట్ అండ్ సస్టైనబిలిటీ కాన్‌క్లేవ్‌లో 7 ఎక్స్‌లెన్స్ అవార్డులను గెలుచుకుంది. భద్రత, పర్యావరణం, సుస్థిర మైనింగ్ విభాగాల్లో అత్యుత్తమ పనితీరు కనబర్చినందుకు ఈ గుర్తింపు దక్కింది. అలాగే, మహా సిమెంట్ టెక్నికల్ డైరెక్టర్ VS నారంగ్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. ఇది వారి 50 ఏళ్ల సిమెంట్ రంగ సేవలకు తగిన గౌరవం.
సిమెంట్ రంగంలో అద్భుత విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న మై హోమ్ గ్రూప్.. 7 ఎక్స్‌లెన్స్ అవార్డులను గెలుచుకుంది. మంగళవారం హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌లో జరిగిన క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన జాతీయ స్థాయి ఎన్విరాన్‌మెంట్ అండ్ సస్టైనబిలిటీ కాన్‌క్లేవ్‌లో.. ఈ అవార్డుల ప్రదానం జరిగింది. సిమెంట్ రంగంలో పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులు హాజరైన ఈ కాన్‌క్లేవ్ ఆద్యంతం సందడిగా జరిగింది. ఎన్విరాన్‌మెంట్ అండ్ సస్టైనబిలిటీ, నెట్ జీరో కేటగిరీలో మైహోమ్ గ్రూప్ సిమెంట్ ప్లాంట్స్‌కనబర్చిన పనితీరుకు గానూ ఏకంగా 7 ఎక్స్‌లెన్స్ అవార్డులు దక్కాయి. భద్రత, ఆరోగ్యం, పర్యావరణం, సుస్థిర మైనింగ్, పునరుత్పాదక ఇంధనం, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల విభాగాలలో మహా సిమెంట్స్ అత్యుత్తమ పనితీరును కనబర్చిందని క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా ప్రతినిధులు ప్రశంసించారు. ఇక.. ఇదే కార్యక్రమంలోనే మహా సిమెంట్ టెక్నికల్ డైరెక్టర్ VS నారంగ్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్‌ను అందజేశారు. 50 ఏళ్ళు సిమెంట్ రంగంలో.. 27 ఏళ్ళు మహా సిమెంట్ సంస్థలో VS నారంగ్ చేసిన విశేష కృషికి గాను ఈ అవార్డ్ దక్కింది. క్వాలిటీ సర్కిల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ ఛైర్మన్ బాలకృష్ణ చేతులు మీదుగా VS నారంగ్ అవార్డ్ అందుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వందే భారత్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్..స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్
పెళ్లిలోకి సడన్ ఎంట్రీ ఇచ్చిన డెలివరీ బాయ్.. ఆ తర్వాత
TOP 9 ET News: ప్రభాస్ నుంచి ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్ | ‘ధురంధర్’కి రూ. 90 కోట్ల నష్టం
Tarun: తరుణ్ ఆ కారణంతోనే సినిమాలు చేయడం లేదు
అల్లుడి ముచ్చట చెబుతూ అత్త మాస్ సాంగ్ !! షేక్ అవుతున్న సోషల్ మీడియా
