Mustard oil: చలికాలంలో ఆవనూనెతో అనేక లాభాలు.! ఇంతకన్నా క్రీమ్స్ అవసరమే లేదు..
చలికాలం మొదలవుతూనే చలిపులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు దారుణంగా తగ్గిపోయాయి. దీంతో వాతావరణంలో తేమ శాతం బాగా తగ్గిపోతుంది. గాలిలో తేమ లేకపోతే... మన శరీరంపై తేమ వేగంగా ఆరిపోతుంది. మరోవైపు తేమ లేని గాలి మన చర్మంపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అందుకే చలికాలంలో బైక్ పై వెళ్తున్నప్పుడు చర్మాన్ని కోస్తున్నట్టుగా మంట పుడుతుంది. చర్మం పొడిబారి, పగుళ్లు వస్తాయి. పొలుసుల్లా ఏర్పడుతుంటాయి. ఈ సమస్యను నివారించడానికి ఆవ నూనె సమర్థవంతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆవ నూనెలో విటమిన్ ఈ తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి చర్మంలో తేమ నిల్వ ఉండటానికి తోడ్పడతాయి. అదే సమయంలో చర్మం మంచి నిగారింపు సంతరించుకునేందుకు వీలు కల్పిస్తాయి. ఆవ నూనెతో చర్మం పగలకుండా ఉంటుంది. చర్మంపై దురద, ర్యాషెస్ వంటివి ఏర్పడకుండా చూస్తుంది. ఈ నూనెతో మర్ధన చేయడం వల్ల చర్మంపై మృత కణాలు తొలగిపోతాయి. చర్మం సున్నితంగా మారుతుంది. చర్మానికి సాగే గుణం పెరుగుతుంది. దీనివల్ల ముడతలు పడకుండా ఉంటుంది. ఇక ఈ నూనెలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు చర్మానికి కావాల్సిన పోషణను అందిస్తాయి. వయసు మీదపడటం వల్ల ఏర్పడే లక్షణాలను నివారిస్తాయి.
ఆవ నూనెకు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. అవి చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. ఆవ నూనెను రాసుకోవడం వల్ల చర్మం మాత్రమే కాదు.. వెంట్రుకల కుదుళ్లు బలపడతాయని నిపుణులు చెబుతున్నారు. చుండ్రు నివారణలో, వెంట్రుకలు తెగిపోకుండా ఉండటానికి కూడా ఆవనూనె తోడ్పడుతుందని వివరిస్తున్నారు. చలి తీవ్రత కారణంగా కండరాలు బిగదీసుకుపోయినట్టు అవుతాయని.. ఆవ నూనెతో చర్మంపై మర్ధన చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరిగి, వేడి నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనితో కండరాలకు ఉపశమనం లభిస్తుందని వివరిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.