ఎయిర్‌పోర్ట్‌ అధికారుల చేతివాటం బ్యాటరీలు, నూనె దొంగిలించి..

Updated on: Sep 10, 2025 | 5:39 PM

ముంబయి ఎయిర్‌పోర్టు లో అధికారులు తమ చేతివాటం చూపించారు. ప్రయాణికుల నుంచి జప్తు చేసిన వస్తువులను దొంగిలించి.. వ్యక్తిగతంగా ఉపయోగించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముంబయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ సంస్థ 15 మంది అధికారులను విధుల్లోంచి తొలగించింది. బ్యాటరీలు, కొన్నిరకాల బొమ్మలు, సెల్లో టేప్‌, మిరపకాయలు, లైటర్లు, ఈ-సిగరెట్లు, కొబ్బరికాయలు, నూనె వంటి వస్తువులను విమానంలో తీసుకెళ్లడం నిషేధం.

ఎవరైనా ప్రయాణికులు ఇలాంటి వస్తువులు తీసుకొస్తే ముందస్తు భద్రతా తనిఖీల్లో వాటిని గుర్తించి జప్తు చేస్తారు. ఈ జప్తు చేసిన వస్తువులను ఎయిర్‌పోర్టులోని కొందరు అధికారులు దొంగిలించి వాటిని వ్యక్తిగతంగా ఉపయోగించుకున్నారు. ఎంఐఏఎల్‌ అధికారులు గత నెలలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. ఈ విషయం బయటపడింది. దీంతో చేతివాటం చూపించిన వారిపై ఎంఐఏఎల్‌ చర్యలు ప్రారంభించింది. ఆ అధికారులను వెంటనే రాజీనామా చేయాలని లేదంటే తొలగింపు ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించింది. రాజీనామా ముప్పు ఎదుర్కొంటున్నవారంతా ఎన్నో ఏళ్ల నుంచి పలు హోదాల్లో విధులు నిర్వహించినట్లు తెలుస్తోంది. రాజీనామా చేయాల్సి వచ్చిన ఓ అధికారి మాత్రం.. తన తప్పును సమర్థించుకున్నారు. ‘ఆ వస్తువులను చెత్త కుండీల్లో పడేస్తారు. లేదా ఏదైనా ఎన్‌జీవోలకు పంపిస్తారు. జప్తు చేసిన వాటిని తీసుకోవడం అనేది ఉద్యోగం నుంచి తొలగించేంత పెద్ద తప్పు కాదు. దీన్ని మొదటి తప్పుగా భావించి హెచ్చరించి ఉండాల్సింది’ అని అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ బాలుడిని చూసి ఆగిపోయిన భారీ వరద

అయ్యో.. మంటల్లో కాలిపోతూ స్కూటీపై ఆసుపత్రికి వెళ్లిన మహిళ

Bigg Boss Telugu 9: మొదలైన ఫస్ట్ వీక్ నామినేషన్స్.. పిచ్చి పిచ్చిగా లొల్లి పెట్టుకున్న బ్యూటీలు

డాక్యుమెంటరీగా.. ప్రొద్దుటూరు దసరా సంబరం

Boney Kapoor: నన్ను రూమ్‌కి కూడా రానిచ్చేది కాదు..