Samatha Kumbh 2026: ముచ్చింతల్‌లో 108 దివ్యదేశాల 4వ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Updated on: Jan 30, 2026 | 5:57 PM

ముచ్చింతల్‌లోని శ్రీ రామనగరం సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో శ్రీభగవద్ రామానుజాచార్య స్వామివారి 108 దివ్యదేశాల 4వ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో ఫిబ్రవరి 9 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి.

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీ రామనగరం సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో శ్రీభగవద్ రామానుజాచార్య స్వామివారికి అంకితంగా నిర్వహిస్తున్న 108 దివ్యదేశాల 4వ బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి స్వీయ పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు ఫిబ్రవరి 9 వరకు కొనసాగనున్నాయి. తొలి రోజు సాయంత్రం అంకురారోపణ కార్యక్రమం, అనంతరం శ్రీ విష్వక్సేన ఆరాధనతో ఉత్సవాలకు శుభారంభం పలికారు. భక్తిశ్రద్ధల మధ్య సాగుతున్న ఈ బ్రహ్మోత్సవాలకు దేశవ్యాప్తంగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది.

 

Published on: Jan 30, 2026 05:56 PM