కన్న కొడుకునే కిల్లర్‌గా మార్చిన తల్లి.. ఎందుకో తెలిస్తే వెన్నులో వణుకే!

Updated on: Aug 18, 2026 | 6:48 PM

సిద్దిపేట జిల్లాలో ఈజీ మనీ కోసం ఓ తల్లి తన మైనర్‌ కుమారుడినే నేరాల బాట పట్టించిన ఘటన కలకలం రేపింది. భూంపల్లికి చెందిన రజిత.. కుమారుడిని బలంగా తయారుచేసి మహిళలపై హత్యలు, దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా ఆధారంగా కేసును ఛేదించిన పోలీసులు తల్లిని అరెస్ట్ చేసి, బాలుడిని జువైనల్‌ హోమ్‌కు తరలించారు. నిందితుల నుంచి బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఎలాంటి కష్టం లేకుండా డబ్బు సంపాదించడానికి ఓ కన్నతల్లి అత్యంత క్రూరమైన మార్గాన్ని ఎంచుకుంది. తన పెంపకంతో క్రమశిక్షణ నేర్పించాల్సిన మైనర్‌ కుమారుడిని ఓ పథకం ప్రకారం సీరియల్‌ కిల్లర్‌గా తయారుచేసింది. జిమ్‌ పరికరాలు కొనిచ్చి.. బలంగా తయారుకావాలని ప్రోత్సహించింది. ఆపై అతని సాయంతో అమాయక మహిళలపై వరుస హత్యలు, దోపిడీలకు ఒడిగట్టిన ఘటన సిద్దిపేట జిల్లా భూంపల్లి గ్రామంలో వెలుగుచూసింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట శివారులో ఈ నెల 8న సగం కాలిన ఓ మహిళ మృతదేహం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతురాలిని అక్బర్ పేట భూంపల్లికి చెందిన 45 ఏళ్ల విజయగా గుర్తించారు. హత్య ఇక్కడే జరిగిందా? లేక వేరే చోట చంపి ఇక్కడకు తీసుకొచ్చి దహనం చేశారా? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. విజయకు తన బంధువులతో ఉన్న భూవివాదాలే ఈ హత్యకు కారణమని మొదట అనుమానించారు. ఆ కోణంలో ఎంత విచారించినా ఒక్క ఆధారం కూడా దొరకలేదు. బ్లైండ్ కేసులా మారిన ఈ మిస్టరీని ఎలాగైనా ఛేదించాలని పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. వందల కొద్దీ సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్న పోలీసులకు.. దగ్గర్లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద దొరికిన చిన్న క్లూ కేసును మలుపు తిప్పింది. TVS XL వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. బాటిల్ లో పెట్రోల్ పట్టించుకోవడం కెమెరాలో రికార్డ్ అయింది. అదే బండి ముందు భాగంలో ఓ పెద్ద సంచి ఉండటం పోలీసుల అనుమానాలను బలపరిచింది. ఆరా తీస్తే.. మృతురాలు విజయ ఇంటికి కేవలం 100 మీటర్ల దూరంలో కిరాణా షాపు నడుపుతున్న వారే ఈ నిందితులని తేలింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించడంతో.. కళ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈజీ మనీ కోసం ఓ తల్లి, తన మైనర్ కొడుకుతో కలిసి ఈ దారుణాలకు ఒడిగట్టినట్లు తేలడంతో పోలీసులే షాక్ అయ్యారు. భూంపల్లికి చెందిన 38 ఏళ్ల రజిత మాస్టర్ మైండ్ అంతా ఇంతా కాదు. తక్కువ టైంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న దురాశతో.. ఏకంగా మైనర్ కొడుకునే నేరాల బాట పట్టించింది. పోలీసులు పట్టుకోకుండా ఉండేందుకు కుటుంబ కలహాలు, భూవివాదాలు ఉన్న మహిళలనే టార్గెట్ గా ఎంచుకుంది. ఈ ఏడాది మే నెలలో రేఖ అనే మహిళను గొంతు నులిమి చంపేసి, అచ్చుమాయిపల్లి అడవిలో కాల్చేశారు. మృతురాలు రేఖ ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండేది. సోషల్‌ మీడియాలో ఫ్రెండ్స్‌ ఎక్కువ. ఆమెను చంపేతే అనుమానం వాళ్లపైకే వెళ్తేందని రజిత వేసిన మాస్టర్ ప్లాన్ ఇది. ఇక విజయకు బంధువులతో ఉన్న భూవివాదాలను ఆసరాగా చేసుకుని, ఆమెను చంపితే పోలీసుల ఫోకస్ బంధువుల వైపు మళ్లుతుందని ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అంతకు ముందు 2025 జూన్ లోనూ ఒంటరిగా వెళ్తున్న అన్నపూర్ణ అనే మహిళపై దాడి చేసి 5 తులాల పుస్తెల తాడును దోచుకెళ్లారు. విచారణలో రజిత చెప్పిన మరో విషయం భూంపల్లి గ్రామస్తులను మరింత భయభ్రాంతులకు గురిచేసింది. ఇదే గ్రామానికి చెందిన మరో నలుగురిని కూడా ఇలాగే హత్య చేసేందుకు ఈ తల్లీకొడుకులు స్కెచ్ వేశారు. ఆస్తి తగాదాలు ఉన్నవారిని గుర్తించడం.. వారిని మట్టుబెట్టి ఒంటిపై ఉన్న నగలు దోచుకెళ్లడం.. ఇదీ వీళ్ల క్రైమ్ స్టైల్. అదృష్టవశాత్తూ పోలీసులకు నిందితులు దొరికిపోవడంతో ఆ నలుగురి ప్రాణాలు దక్కాయి. ప్రధాన నిందితురాలు రజితను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.. మైనర్ బాలుడిని జువైనల్ హోమ్ కు పంపారు. వీరి వద్ద నుంచి 5.6 తులాల బంగారం, 53 తులాల వెండి, లక్ష రూపాయల నగదుతో పాటు ఓ బైక్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దూసుకొచ్చిన మృత్యువు.. తల్లిదండ్రుల ముందే విగతజీవిగా మారిన యువతి

బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు!

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒకేసారి 5 అదిరిపోయే పథకాలు!

అది ఇల్లా.. బంగారు గనా..! రెనోవేషన్‌ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం

మీ చెప్పులు పోయాయా.. అయితే చాట్‌ జీపీటీని అడగండి.. ఇట్టే దొరికేస్తాయ్‌

Loading...
Unable to load recommendations.
Follow Us