తెలంగాణకు చల్లటి కబురు.. ఏపీలో ఎండలు, వానలు!

Updated on: Jun 08, 2026 | 12:45 PM

తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఏర్పడగా, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండటంతో హీట్ అలర్ట్ జారీ చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతోంది. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు నేడో, రేపో రాష్ట్రాన్ని తాకేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. అక్కడక్కడ కురిసిన తేలికపాటి వర్షాలతో ఎండల తీవ్రత తగ్గి, వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. రాష్ట్రంలో ఒకవైపు వర్షాలు, ఇంకోవైపు భానుడి భగభగలు జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. రాయలసీమ ప్రాంతాలైన కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఆదివారం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అయితే, ఉత్తరాంధ్రలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉండటంతో అధికారులు హీట్ అలర్ట్ జారీ చేశారు. తీవ్రమైన ఉక్కపోత, ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నీటి చుక్క దొరక్క ఎడారిలో 49 మంది మృతి

అండమాన్‌లో మరో భారీ గ్యాస్ నిక్షేపం.. భారత్ ఇంధన భవిష్యత్తుకు కొత్త ఆశలు

Yash: ముంబై బీచ్‌లో రూ. 24 కోట్ల ప్రాపర్టీ కొన్న యశ్!

బంగారం పెట్టుబడిదారులకు బిగ్ షాక్.. గోల్డ్ ఫండ్స్‌పై కొత్త రూల్స్..!

‘ఎంత తొక్కాలని చూస్తే అంత ఎత్తుకు ఎదుగుతాడు’

Loading...
Unable to load recommendations.
Follow Us