Weather Report: నైరుతి తిరోగమనం.. 3 రోజులు ముందుగానే
ఈ ఏడాది ముందే పలకరించి, సమృద్ధిగా వర్షాలను కురిపించిన నైరుతి రుతుపవనాల తిరోగమనం మొదలైంది. ఆదివారం పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాల తిరుగు ప్రయాణం మొదలైంది. సాధారణంగా ఏటా సెప్టెంబరు 17న ప్రారంభం కావాల్సిన ఈ ప్రక్రియ ఈసారి మూడు రోజుల ముందుగానే మొదలవడం గమనార్హం.
అయితే.. ఈ ఏడాది ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా అంచనాలకు మించి వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి సెప్టెంబరు 14 మధ్య కాలంలో సాధారణంగా 790.1 మిల్లీమీటర్ల వర్షం కురిసేది. కానీ.. ఈసారి 846.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఇది సాధారణం కంటే 7 శాతం అధికం. ఓవైపు రుతుపవనాలు తిరోగమనం ప్రారంభమైన వేళ, బంగాళాఖాతంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్త ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వాతావరణ అధికారుల అంచనా ప్రకారం ఈ ఆవర్తనం సెప్టెంబర్ 20వ తేదీ నాటికి వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అయితే, అది ఆ తర్వాత మరింత బలపడుతుందా? లేదా? అనే విషయంపై ఇప్పుడే చెప్పలేమని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Honey Trap: హనీ ట్రాప్‌లో యోగా గురువు.. ఆ తర్వాత
దొంగల ముఠాకు దిమ్మదిరిగే షాకిచ్చిన మేకలు
