హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. దీనితో మీ సామాన్లు భద్రం

Updated on: Dec 02, 2025 | 5:57 PM

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు లగేజీ భద్రత కోసం స్మార్ట్ లాకర్ సేవలను ప్రవేశపెట్టింది. టక్కీట్‌తో కలిసి తొలి దశలో మియాపూర్, అమీర్‌పేట్ సహా ఏడు స్టేషన్లలో ఈ లాకర్లు అందుబాటులోకి వచ్చాయి. రద్దీ సమయంలో లగేజీ కష్టం లేకుండా, QR కోడ్ ద్వారా సులభంగా ఉపయోగించుకునే ఈ సేవలు త్వరలో అన్ని మెట్రో స్టేషన్లలో విస్తరించనున్నాయి. ఇది ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తుంది.

మెట్రో ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. బస్లాండ్లు, రైల్వే స్టేషన్లలో సామాన్లు భద్రపర్చుకోవడానికి ప్రయాణికులకు లాకర్ల సదుపాయం అందుబాాటులో ఉంటుంది. అలాంటి సేవలనే ఇప్పుడు హైదరాబాద్ మెట్రో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం కొన్ని మెట్రో స్టేషన్లలో స్మార్ట్ లాకర్లను అందుబాటులోకి తీసుకురాగా.. త్వరలో మిగతా అన్నీ స్టేషన్లలో కూడా రానున్నాయి. మెట్రో రైలులో ప్రయాణించే ప్రయాణికుల లగేజీ కష్టాలను తీర్చనుంది. ఇందుకోసం టక్కీట్ అనే సంస్థతో కలిసి పనిచేయనుంది. తొలివిడతలో కేవలం ఏడు స్టేషన్లలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. మెట్రోలో ప్రయాణించే వారి వద్ద హెల్మెట్లు, బ్యాగులు, ఇతర షాపింగ్ సంచులు వంటివి ఉంటాయి. రద్దీగా ఉండే సమయాల్లో వీటిని మోస్తూ జర్నీ చేయడం చాలా కష్టం. ఇకపై మెట్రో ప్రయాణికులకు ఆ బాధలుండవు. లగేజీని స్టేషన్లలోనే లాకర్లో సేఫ్ గా పెట్టుకుని, హ్యాండ్స్ ఫ్రీగా సిటీలో చక్కర్లు కొట్టేయొచ్చు. ప్రస్తుతం మియాపూర్, అమీర్‌పేట్, పంజాగుట్ట,ఎల్బీనగర్, ఉప్పల్, పరేడ్ గ్రౌండ్, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లలో ఈ స్మార్ట్ లాకర్లను ప్రవేశపెట్టారు. టెక్నాలజీ ఆధారంగా ఇవి పనిచేస్తాయి. ప్రయాణికులు తమ వస్తువులను సురక్షితంగా ఇక్కడ భద్రపర్చుకోవచ్చు. లాకర్‌ ప్యానెల్‌లో ఉండే QR కోడ్‌ను స్కాన్‌ చేసి 30 సెకన్లలోపు ఈ స్మార్ట్‌ లాకర్లను ఓపెన్‌ చేయవచ్చు. మీ వస్తువుల ఆధారంగా లాకార్ల పరిమాణాన్ని ఎంచుకుని, ఎంత సమయం ఉపయోగించుకుంటున్నారనేది సెలక్ట్ చేసుకుని పేమెంట్ చేయాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆధార్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆ పని ఇంటినుంచే చేయచ్చు

లింగభైరవి దేవి అంతశక్తిగల దైవమా.. ఈ అమ్మ అనుగ్రహం పొందితే..

జామ్ జామ్ గా.. భుజాలపై కోతిని ఎక్కించుకుని బైక్ రైడ్.. మస్త్ ఫీల్ ఉందంటున్న బుచ్చిరాములు

Varanasi: వారణాసి సినిమా షూట్‌కు బ్రేక్.. కారణం..

TOP 9 ET News: ఫస్ట్ డేనే లీక్‌.. ఎంత కష్టపడి ఏం లాభం సందీపా