Rains in AP: ఏపీ ప్రజలూ బీ అలెర్ట్.. ఇక వానలే వానలు.!

|

Jun 18, 2024 | 12:12 PM

నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం నవ్‌సారి, జల్గావ్, అమరావతి, చంద్రాపూర్, బీజాపూర్, సుక్మా, మల్కన్‌గిరి, విజయనగరం, ఇస్లాంపూర్ గుండా కొనసాగుతున్నాయి. తదుపరి 4-5 రోజులలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కోస్తాంధ్రా, వాయువ్య బంగాళాఖాతం, గంగా పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు, ఉప హిమాలయప్రాంతం, పశ్చిమ బెంగాల్‌లోని మిగిలిన భాగాలు, బీహార్‌లోని కొన్ని ప్రాంతాలలో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.

నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం నవ్‌సారి, జల్గావ్, అమరావతి, చంద్రాపూర్, బీజాపూర్, సుక్మా, మల్కన్‌గిరి, విజయనగరం, ఇస్లాంపూర్ గుండా కొనసాగుతున్నాయి. తదుపరి 4-5 రోజులలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కోస్తాంధ్రా, వాయువ్య బంగాళాఖాతం, గంగా పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు, ఉప హిమాలయప్రాంతం, పశ్చిమ బెంగాల్‌లోని మిగిలిన భాగాలు, బీహార్‌లోని కొన్ని ప్రాంతాలలో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. సముద్ర మట్టానికి సగటున 3.1 కి.మీ.. అలాగే 7.6 కి.మీ మధ్య నైరుతికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీద ఉపరితల అవర్తనం ఉంది. సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ మరియు 5.8 కి.మీ మధ్య రాయలసీమ నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు గల ద్రోణి ఇప్పుడు బలహీనపడింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ , యానాంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది.

గంటలకు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. 30 నుంచి 40 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మంగళవారం కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఈదురు గాలులు కూడా వీచే ఛాన్స్‌ ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ లోనూ మూడు రోజులపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలోనూ తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on