పసి పిల్లలు, బాలింతల కోసం జంపన్న వాగు వద్ద ఉడుకు నీళ్లు
మేడారం జాతరలో జంపన్న వాగుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అయితే, చలి నీటిలో స్నానం చేయలేని పసి పిల్లలు, బాలింతలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడే వారి కోసం ఇక్కడ వేడి నీళ్లు విక్రయించే కొత్త ప్రయోగం మొదలైంది. ఇది భక్తులకు సౌకర్యాన్ని అందించడమే కాకుండా, విక్రయించే వారికి జీవనోపాధిని కూడా కల్పిస్తోంది.
మేడారం జాతరలో భక్తులు సమ్మక్క సారక్క గద్దెలను దర్శించుకునే ముందు జంపన్న వాగులో స్నానం ఆచరించడం ఆనవాయితీ. జంపన్న వాగులో మునిగితే పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అయితే, జలుబు, దగ్గు, ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలున్న వారికి, అలాగే పసి పిల్లలకు, బాలింతలకు, వృద్ధులకు చన్నీళ్ల స్నానం కష్టంతో కూడుకున్నది. ఈ సమస్యను గుర్తించిన కొంతమంది, భక్తుల సౌలభ్యం కోసం జంపన్న వాగు ఘాట్ల వద్ద వేడి నీళ్లను విక్రయించడం ప్రారంభించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక జంక్ ఫుడ్ యాడ్స్‌పై బ్యాన్.. ఆరోగ్య సమస్యలకు చెక్
అమ్మమ్మకు మెసేజ్ పంపిన కో పైలట్ శాంభవి.. చివరికి..
Medaram Jathara: తెలంగాణ కుంభమేళా.. మేడారం జాతర విశిష్టత ఏంటంటే..
Medaram Jatara 2026: మేడారంలో వెలసిన సెల్‌ఫోన్ ఛార్జింగ్ పాయింట్లు