రెడ్ కార్పెట్‌తో మాజీ మావోయిస్టు నేతకు స్వాగతం.. 45 ఏళ్ల తర్వాత..

Edited By:

Updated on: Jan 26, 2026 | 3:43 PM

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద రావు అలియాస్ చంద్రన్న, జనజీవనంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా తన స్వగ్రామం వడుకాపూర్‌కు వచ్చారు. గ్రామస్థులు ఆయనకు రెడ్ కార్పెట్ వేసి, పూల వర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. సుదీర్ఘకాలం తర్వాత స్వగ్రామానికి చేరుకున్న చంద్రన్న, తన గత 45 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ, గ్రామస్థులతో ముచ్చటించారు. ఈ పర్యటన విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద రావు అలియాస్ చంద్రన్న ఆదివారం తన స్వగ్రామమైన వడుకాపూర్ వచ్చారు. గ్రామస్థులతో కలిసి ముచ్చటించిన ఆయనకు ఘనంగా సత్కరించారు. గత సంవత్సరం అక్టోబర్ 28న తెలంగాణ పోలీసుల ముందు జనజీవనంలోకి వచ్చిన చంద్రన్న తొలిసారిగా గ్రామానికి చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రన్న ప్రసంగించే అవకాశాలు ఉన్నాయి. సుదీర్ఘ కాలం తరువాత స్వగ్రామానికి వచ్చిన చంద్రన్నకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రెడ్ కార్పెట్ వేసి పూలు చల్లుతూ ఆయనను ఆహ్వానించారు. ఊహించని రీతిలో చంద్రన్నకు గ్రామస్థులు స్వాగతం తెలపడం విశేషం. దాదాపు 45 ఏళ్ల క్రితం విప్లవోద్యమం వైపు సాగిన పుల్లూరి ప్రసాదరావు గ్రామానికి వచ్చిన సందర్బాలు చాలా తక్కువేనని చెప్పాలి. 1979లో రాడికల్ విద్యార్థి సంఘం (RSU)లో పని చేసిన చంద్రన్న 1980లో కేఎస్ గ్రూప్ కొరియర్ గా పనిచేసి ఆతరువాత అజ్ఞాతంలోకి వెళ్లారు. మొదట ప్రస్తుత కేంద్ర కమిటీ సభ్యుడు శాస్త్రుల్లపల్లి రాజిరెడ్డి నేతృత్వంలో పని చేస్తున్న క్రమంలో అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆసిఫాబాద్ దళంలో చేరిన కేంద్ర కమిటీ సభ్యునిగా ఎదిగారు. అజ్ఞాతంలోకి వెళ్లిన తరువాత గ్రామస్థులందరిని ఒకేసారి కలిసే అవకాశం లేకుండాపోయింది. చంద్రన్న జనవజీనంలోకి వచ్చిన తరువాత మొదటి సారిగా స్వగ్రామానికి వచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీ చేతికి ఇవ్వలేదని దారుణం.. CCTVలో రికార్డు అయిన దృశ్యం

బైక్, కారు రిజిస్ట్రేషన్స్‌ ఇకపై అక్కడే.. RTOకి వెళ్లాల్సిన అవసరం లేదు

8వ తరగతి విద్యార్థి అద్భుత ప్రతిభ.. ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో సృజనాత్మకత

రేకుల ఇంట్లో రచ్చ రచ్చ.. తలుపు తీసి చూసిన పోలీసులకు షాక్

ఉదయం ఇంట్లోనుంచి బయటకు రాగానే.. భయానక దృశ్యం.. ఇలా ఉన్నారేంట్రా

Published on: Jan 26, 2026 02:48 PM