Vitamin D: మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!

|

Oct 12, 2024 | 8:29 PM

మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్ డి చాలా ముఖ్యమైన పోషకం. ఇది లోపిస్తే శరీరంలో చాలా సమస్యలు తలెత్తుతాయి. మన దేశంలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ఈ విటమిన్ లోపం బారిన పడుతున్నారు. వయసు పెరిగే కొద్దీ ఈ విటమిన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే గర్భం దాల్చిన తర్వాత.. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మహిళల్లో సాధారణంగా విటమిన్ డి, కాల్షియం, ఐరన్ లోపించడం ప్రారంభమవుతుంది.

మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్ డి చాలా ముఖ్యమైన పోషకం. ఇది లోపిస్తే శరీరంలో చాలా సమస్యలు తలెత్తుతాయి. మన దేశంలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ఈ విటమిన్ లోపం బారిన పడుతున్నారు. వయసు పెరిగే కొద్దీ ఈ విటమిన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే గర్భం దాల్చిన తర్వాత.. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మహిళల్లో సాధారణంగా విటమిన్ డి, కాల్షియం, ఐరన్ లోపించడం ప్రారంభమవుతుంది. శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది. వీటిని పట్టించుకోకపోతే దీర్ఘకాలంలో చాలా సమస్యలు వస్తాయి.

నేచర్ జర్నల్లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. విటమిన్ డి లోపం వల్ల మహిళల్లో గుండె ఆగిపోవడం, గుండెపోటు, స్ట్రోక్, మధుమేహం, అధిక రక్తపోటు కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండే మహిళల్లో విటమిన్ డి లోపం పెరుగుతోంది. చాలా మంది మహిళలు తమ శరీరమంతా కప్పి ఉంచే దుస్తులను ధరిస్తారు. దీని కారణంగా శరీరం సూర్య కిరణాలను గ్రహించడం సాధ్యం కాదు. ఇది మహిళల్లో విటమిన్ డి లోపానికి కారణం అవుతుంది. పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు కాల్షియం లోపంతో బాధపడుతున్నారు. శరీరంలో విటమిన్ డి శోషణకు కాల్షియం చాలా ముఖ్యమైనది. విటమిన్ డి లోపం వల్ల మహిళలు తరచుగా అలసట, బలహీనతకు గురవుతారు. విపరీతమైన అలసట కలుగుతుంది. విటమిన్ డి లోపం రోగనిరోధక శక్తిని కూడా బలహీనపరుస్తుంది. దీని కారణంగా మహిళలు తరచుగా అనారోగ్యానికి గురవుతారు. విటమిన్ డి లోపం కారణంగా మహిళల్లో ఒత్తిడి, డిప్రెషన్ లక్షణాలు తరచుగా కనిపిస్తాయి. విటమిన్ డి లోపం వల్ల కూడా ఎముకలు,దంతాలు బలహీనపడతాయి. కీళ్లనొప్పులు తలెత్తుతాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on