Mango Peel: మామిడి తొక్క వల్ల లాభాలు తెలిస్తే అస్సలు పడేయరు..!

|

Jun 11, 2024 | 11:30 AM

వేసవిలో నోరూరించే మామిడి పండ్లు మార్కెట్లో కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తాయి. బంగినపల్లి, చెరుకు రసాలు, సువర్ణరేఖ, నీలం.. ఇలా రకరకాల మామిడి పండ్లు ఈ సీజన్‌లో లభిస్తాయి. పులుపు, తీపి రుచితో పసందైన మామిడిపండ్లు కనిపిస్తే నోరూరని వారుండరు. అయితే చాలా మంది మామిడి పండ్లను ఎంతో ఇష్టంగా తింటారు కానీ తొక్క తినేందుకు ఇష్టపడరు. నిజానికి.. పండుకన్నా తొక్కలోనే చాలా పోషకాలు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.

వేసవిలో నోరూరించే మామిడి పండ్లు మార్కెట్లో కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తాయి. బంగినపల్లి, చెరుకు రసాలు, సువర్ణరేఖ, నీలం.. ఇలా రకరకాల మామిడి పండ్లు ఈ సీజన్‌లో లభిస్తాయి. పులుపు, తీపి రుచితో పసందైన మామిడిపండ్లు కనిపిస్తే నోరూరని వారుండరు. అయితే చాలా మంది మామిడి పండ్లను ఎంతో ఇష్టంగా తింటారు కానీ తొక్క తినేందుకు ఇష్టపడరు. నిజానికి.. పండుకన్నా తొక్కలోనే చాలా పోషకాలు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అవును.. మామిడి తొక్కలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మామిడి తొక్కలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు పండిన మామిడి పండ్లను తినేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మరీ తింటుంటారు. కానీ మామిడి తొక్క మధుమేహ రోగులకు కీడుకన్నా మేలే అధికంగా చేస్తుందంటున్నారు నిపుణులు. మామిడి తొక్కలో యాంటీ-డయాబెటిక్ లక్షణాలు ఉంటాయట. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. మామిడి తొక్క చర్మాన్ని హానికరమైన సూర్య కిరణాల నుంచి రక్షిస్తుంది. మామిడి తొక్క UV కిరణాల నుంచి రక్షణను అందిస్తుంది. ఇది టాన్, సన్‌బర్న్, అకాల వృద్ధాప్యం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మామిడి తొక్కలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కూడా ఉంటాయి. మామిడి తొక్కలను నమలడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మామిడి తొక్క నోటిలోని సూక్ష్మక్రిములను, బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

మామిడి తొక్కలో ఫ్లేవనాయిడ్స్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి పలు రకాల గాయాలను నయం చేయడంలో సహాయపడతాయి. మామిడి తొక్క పేస్ట్‌ను చర్మ ఇన్‌ఫెక్షన్‌లపై పూయడం వల్ల గాయం త్వరగా మానుతుంది. మామిడి తొక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది శారీరక మంటను తగ్గిస్తుంది. మామిడి తొక్క ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి, జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ పండు తొక్క.. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మామిడి తొక్కతో స్మూతీస్, చట్నీలు కూడా చేసుకోవచ్చు. మామిడి తొక్క టీ తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మామిడికాయ తొక్కను నీళ్లతో మరిగించి టీ తయారు చేసుకోవచ్చు. అయితే మామిడి తొక్కను ఆహారంలో ఉపయోగించే ముందు బాగా కడిగి ఉపయోగించాలి. ఈ సమాచారం అంతా కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వైద్య చికిత్సకు ఇది ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on