కళ్యాణకట్టలో ఉద్యోగాలంటూ బురిడీ కొట్టించిన లేడీ కిలాడీ

Updated on: Nov 15, 2025 | 11:32 AM

మంగళగిరి న్యాయవాది సుధా రెడ్డి TTDలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి 200 మంది బాధితుల నుండి సుమారు 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నాలుగేళ్లు గడిచినా ఉద్యోగాలు రాకపోవడంతో, డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే నిరాకరించింది. డబ్బులు పోగొట్టుకున్న బాధితులు లాయర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టగా, పోలీసులు రంగంలోకి దిగారు. బాధితులు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు.

ఆమె న్యాయవాదిగా అందరికి సుపరిచితం. మంగళగిరిలోనే ఒక ఆఫీస్ నడపుతూ ఉండేది. దీంతో ఆమె పట్ల స్థానికులకు నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలోనే కొంతమందికి టిటిడిలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికింది. ఆమె మాటలు నమ్మిన గుంటూరు వాసులు… కొందరు ఒక్కొక్కరు లక్ష నుండి నాలుగు లక్షల రూపాయల వరకూ ఆమెకు చెల్లించారు. డబ్బులు చెల్లించి నాలుగేళ్లు గడిచినా ఉద్యోగం రాలేదు. డబ్బులివ్వాలని అడిగితే నావద్ద లేవంటూ చేతులెత్తేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. మంగళగిరికి చెందిన సుధా రెడ్డి చేసిన మోసంపై బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తనకి టిటిడిలో తెలిసిన వాళ్లు ఉన్నారని చెప్పుకున్న సుధారెడ్డి కల్యాణ కట్టలో తలనీలాలు తొలగించే ఉద్యోగాలున్నాయని డబ్బులిస్తే ఆ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ చెప్పింది. దీంతో చాలా మంది నాయీ బ్రాహ్మణులు ఆమె మాటలు నమ్మారు. గుంటూరు నగరంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు 2022 డిసెంబర్ లో ఆమె కార్యాలయానికి వెళ్లి ఒక్కొక్కరు లక్ష నుండి లక్షన్నర వరకూ కట్టారు. 2023 జనవరిలోనే ఉద్యోగాలు వస్తాయంటూ చెప్పింది. ఆ తర్వాత జూన్ వరకూ వెయిట్ చేయాలని చెప్పింది. అప్పటి నుండి ప్రతి ఆరు నెలలకొకసారి ఇదిగో అదిగో అంటూ వాయిదాలు వేస్తూ వస్తోంది. 2024 ఎన్నికల తర్వాత జగన్ ప్రభుత్వం రాలేదని, దీంతో ఉద్యోగాలు రావంటూ కుండ బద్దలు కొట్టేసింది. దీంతో బాధితులు తమ డబ్బు తిరిగి ఇవ్వాలని కోరారు. డబ్బు కూడా ఇవ్వకుండా వాయిదాలు వేస్తుండటంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్ష రూపాయలు కట్టిన వారికి యాబై వేలు ఇస్తానంటూ బేరాలు మొదలు పెట్టింది. దాదాపు 200 మంది బాధితులు తమ డబ్బు తమకు తిరిగి ఇవ్వాలని బాధితులు లాయర్‌ ఆఫీసుకు చేరుకొని ఆందోళ చేపట్టారు. విషయం పోలీసులకు తెలియడంతో వారు కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. అయితే బాధితులెవరూ ఇప్పటివరకూ ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల మంది నుండి మూడు కోట్ల రూపాయల వరకూ వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, ప్రభుత్వం స్పందించి తమకు డబ్బులిప్పించాలని కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లక్కీ డ్రాలో రూ.250 కే సొంతిల్లు! పోలీసుల రంగ ప్రవేశంతో

ఆ ఊరి కుక్కలన్నీ వారికి నేస్తాలే.. శునకాల సేవలో ఆధ్యాత్మిక ఆనందం

Telangana: రైతన్నలకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌

పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరోయిన్

వీడసలు టీచరేనా.. విద్యార్థినిని ఏమార్చి.. అలా ఎలా చేసాడు… చిన్న పిల్లరా