దెయ్యం వదిలిస్తానని దెబ్బలు .. తాళలేక మహిళ మృతి వీడియో
సమాజం అభివృద్ధి వైపు దూసుకుపోతున్నా.. కొన్ని ప్రాంతాల్లో ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. చేతబడి, క్షుద్రపూజల పేరుతో పలు ప్రాంతాల్లో అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లకుండా భూతవైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాడో కొడుకు. కొడుకు నిర్వాకంతో ఆ తల్లి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
తాజాగా బీహార్ లో చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఓ కుటుంబంలోని ఐదుగురిని గ్రామస్తులు సజీవ దహనం చేశారు. అదేవిధంగా కర్ణాటక లో దెయ్యం పట్టిందని ఓ మహిళను కొట్టిచంపారు.వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లాకు చెందిన 55 ఏళ్ల మహిళ గీతమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దాంతో ఆమె కుమారుడు ఆమెను భూత వైద్యం చేసే దంపతుల దగ్గరికి తీసుకెళ్లాడు. వాళ్లు దెయ్యాన్ని వదిలించే పేరుతో సోమవారం రాత్రి 9.30 గంటల నుంచి 1.30 గంటల వరకు నాలుగు గంటలపాటు చిత్రవధ చేశారు. చేతులతో, కర్రలతో తీవ్రంగా కొట్టారు. దాంతో ఆమె దెబ్బలకు తాళలేక ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి కుమారుడిని, బూత వైద్యం చేసిన దంపతులను అరెస్ట్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం :