మకరజ్యోతి దర్శనం ఏర్పాట్లు... అయ్యప్ప భక్తులూ.. ఆంక్షలు ఉన్నాయి చూసుకోండి
Makara Jyothi

మకరజ్యోతి దర్శనం ఏర్పాట్లు… అయ్యప్ప భక్తులూ.. ఆంక్షలు ఉన్నాయి చూసుకోండి

Updated on: Jan 15, 2026 | 9:11 AM

శబరిమల మకరజ్యోతి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు దర్శన కోటాపై ఆంక్షలు విధించారు. జనవరి 14న 30,000 మందికి మాత్రమే అనుమతిస్తారు. భద్రతా చర్యలు, వాహనాల పార్కింగ్ నిబంధనలు అమలులో ఉన్నాయి. మకర సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామి మకరజ్యోతిగా దర్శనమిస్తాడని భక్తుల విశ్వాసం.

శబరిమల అయ్యప్ప స్వామి మకరజ్యోతి దర్శనానికి సమయం ఆసన్నమైంది. మకర సంక్రాంతి వేళ శబరిమల గిరుల్లో మణికంఠుడు మకరజ్యోతిగా దర్శనమిస్తాడని భక్తుల విశ్వాసం. ఈ అపురూప ఘట్టాన్ని కళ్లారా చూసేందుకు లక్షలాది మంది భక్తులు పోటెత్తనుండటంతో, రద్దీని నియంత్రించేందుకు అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు, మకరవిళక్కు ఉత్సవాలకు వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పక్కా భద్రతా ఏర్పాట్లు చేశారు. దర్శన కోటాపై ఆంక్షలు విధిస్తూ అధికారులు క్రమబద్ధీకరించారు. అత్యంత కీలకమైన జనవరి 14న, మకరజ్యోతి దర్శనం రోజున 30,000 మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుంది.

మరిన్ని వీడియోల కోసం :

జపాన్‌లో సుకుమార్‌.. పుష్ప2 పనుల్లో బిజీబిజీ

కల్కి 2 హీరోయిన్ ఎవరు.. అసలేం జరుగుతోంది అక్కడ..?

చిరంజీవి..యాక్టింగ్ చించేశారు..అల్లు అరవింద్ రియాక్షన్ ఇదే

పెళ్లాం కాదు.. భర్త ఊరెళితే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూ