131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ప్రధాని మోదీ ప్రసంగం
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు తుది రూపం ఇచ్చేందుకు, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాలను పెంచేందుకు, పునర్విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం 3 కీలక బిల్లులను గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అనంతరం వీటిపై చర్చలో భాగంగా ప్రధాని మోదీ సభలో మాట్లాడారు. ఆ డీటేల్స్ ఈ కథనంలో ...
లోక్‌సభలో మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టింది కేంద్రం. 131 రాజ్యాంగ సవరణ బిల్లును అర్జున్ మేఘ్వాల్ ప్రవేశపెట్టగా.. డీలిమిటేషన్ బిల్లును హోంమంత్రి అమిత్‌షా ప్రవేశపెట్టారు. మహిళా రిజర్వేషన్లకు తుది రూపం, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాల పెంపు, పునర్విభజన బిల్లలపై ప్రధాని ప్రస్తుతం పార్లమెంట్‌లో ప్రసంగిస్తున్నారు. దేశ చరిత్రలో కొన్ని కీలక ఘట్టాలుంటాయి..
ఇది అలాంటి సమయమే అని ప్రధాని పేర్కొన్నారు. 30 ఏళ్ల క్రితం ఆమోదించాల్సిన బిల్లు ఇప్పుడు సభ ముందుకు వచ్చిందన్నారు. మహిళలకు నిర్ణయాధికారం ఉండాలనేదే తమ లక్ష్యమన్నారు.
Published on: Apr 16, 2026 03:13 PM
Follow Us
