అక్కడ నీరు, ఆహారం దొరక్క మరణిస్తున్న చిరుతలు.. వన్యప్రాణులను పట్టించుకోని అటవీశాఖ..
అనంతపురం జిల్లాలో వరుసగా చిరుత పులుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల కాలంలో చిరుత పులలో మరణాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. కళ్యాణదుర్గం శెట్టూరు మండలం అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు తాగడానికి నీరు కూడా దొరకడం లేదు. దీంతో రెండు రోజుల క్రితం ఓ చిరుత మృతి చెందింది.
అనంతపురం జిల్లాలో వరుసగా చిరుత పులుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల కాలంలో చిరుత పులలో మరణాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. కళ్యాణదుర్గం శెట్టూరు మండలం అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు తాగడానికి నీరు కూడా దొరకడం లేదు. దీంతో రెండు రోజుల క్రితం ఓ చిరుత మృతి చెందింది. వేసవికాలంలో వన్యప్రాణులకు అటవీ ప్రాంతంలో నీటి తొట్టెలు ఏర్పాటు చేయడంలో అటవీశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో నీరు దొరక్క చిరుత మృతి చెందడం అత్యంత బాధాకరం అంటున్నారు స్థానికులు. తాజాగా కూడేరు మండలం పి నాగిరెడ్డిపల్లిలో మరో చిరుత పులి మృతి చెందింది. అటవీ ప్రాంతంలో ఆహారం దొరక్క చిరుత పులి జనావాసాల్లోకి వచ్చింది. పి .నాగిరెడ్డిపల్లిలో ఆహారం కోసం వచ్చిన చిరుత పులి కరెంటు ట్రాన్స్ఫార్మర్ మీదకు ఎక్కడంతో షాక్ కొట్టి మృతి చెందింది. ఇటీవల ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా చోట్ల చిరుత పులుల మరణించాయి. చిరుత పులుల మరణానికి కారణాలు ఏవైనా.. అటవీ ప్రాంతంలో ముఖ్యంగా వేసవికాలంలో వన్యప్రాణుల కోసం నీరు, ఆహారం ఏర్పాటు చేయడం అటవీశాఖ అధికారుల బాధ్యత అని స్థానికులు వాపోతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..